Saidharam Tej : టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ రాళ్ల దాడి..
జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పోటీ చేస్తున్న పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Tollywood hero Saidharam Tej stone attack..
ఏపీలో ఎన్నికల (AP Elections) సమయం దగ్గర పడుతున్న ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవలే మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల దాడికి పాల్పడగా..నిన్న బీజేపీ (BJP) అభ్యర్థి సీఎం రమేష్ ఫై దాడికి పాల్పడ్డారు. ఈరోజు జనసేన పార్టీ ప్రచారంలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఫై దాడి చేసారు.
ఇక విషయంలోకి వెళితే..
జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పోటీ చేస్తున్న పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాకినాడ జిల్లా తాటిపర్తి కూడలిలో ధరమ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడి చినజగ్గంపేట వెళ్లారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో తేజ్ పర్యటిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆయన వాహనంపైకి రాయి విసిరాడు. ఆ రాయి నల్లల శ్రీధర్ అనే జనసైనికుడికి తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే, ఆ రాయి జనసేన కార్యకర్త నల్లల శ్రీధర్కు తగిలినట్టు తెలుస్తోంది. ఈ దాడికి కారణం వంగా గీత అని జనసైనికులు ఆరోపిస్తున్నారు.
SSM