TDP LEADERS TENSION : టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు… బీజేపీ బాంబు ఎవరిపై పడుతుందో…

టీడీపీ (TDP) అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) నాయుడు బిజెపి (BJP) తో ఒప్పందం పెట్టుకుని తిరిగి వచ్చేసారు. రేపో మాపో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) వాటాగా కొన్ని ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేయడమే ఇక ఆలస్యం. చంద్రబాబు (Chandrababu) నిర్ణయం పార్టీలో చాలామందికి మింగుడు పడటం లేదు. ఐదేళ్లపాటు పార్టీని కాపాడుకుంటూ, పార్టీని నమ్ముకుంటూ అష్ట కష్టాలు పడి ఎన్నికల వరకు వస్తే… ఇప్పుడు చంద్రబాబు వెళ్లి 8 ఎంపీ సీట్లు బిజెపికి ఇస్తానని చెబుతూ...ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం టిడిపిలో సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 10, 2024 | 09:30 AMLast Updated on: Feb 10, 2024 | 9:30 AM

Trains In The Hearts Of Tdp Leaders On Whom Will The Bjp Bomb Fall

టీడీపీ (TDP) అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) నాయుడు బిజెపి (BJP) తో ఒప్పందం పెట్టుకుని తిరిగి వచ్చేసారు. రేపో మాపో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) వాటాగా కొన్ని ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేయడమే ఇక ఆలస్యం. చంద్రబాబు (Chandrababu) నిర్ణయం పార్టీలో చాలామందికి మింగుడు పడటం లేదు. ఐదేళ్లపాటు పార్టీని కాపాడుకుంటూ, పార్టీని నమ్ముకుంటూ అష్ట కష్టాలు పడి ఎన్నికల వరకు వస్తే… ఇప్పుడు చంద్రబాబు వెళ్లి 8 ఎంపీ సీట్లు బిజెపికి ఇస్తానని చెబుతూ…ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం టిడిపిలో సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేన(Janasena)తో పొత్తు వల్ల ఇప్పటికే 25 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ సీట్లు ఆ పార్టీకి వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు బిజెపి ఎనిమిది లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ స్థానాలు అడుగుతోంది. అంటే మొత్తంగా టీడీపీ తన మిత్రపక్షాలకి 35 అసెంబ్లీ సీట్లు 10 లోక్ సభ సీట్లు ఇవ్వాల్సి వస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన అడుగుతున్న లోక్ సభ సీట్లన్నీ టీడీపీ చాలా బలంగా ఉన్న స్థానాలే. అక్కడ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది టీడీపీ. అందరూ ఎలక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టేసారు. బిజెపి జనసేన అడుగుతున్న సీట్లు అన్ని టిడిపి సీనియర్ నేతలు, ఆర్థికంగా బలమైన నేతలు ఉన్న స్థానాలే. అక్కడ ఏమాత్రం బలం లేకపోయినా కూడా బిజెపి అవే సీట్లు కోరుతోంది. అందుక్కారణం ఆయా స్థానాల్లో టిడిపి వాళ్ళు చచ్చినట్లు ఓటేస్తారు… గెలిపిస్తారు అని బీజేపీ ధీమాగా ఉంది. జనసేన మచిలీపట్నం, కాకినాడ ఎంపీ సీట్లు అడుగుతుండగా… బీజేపీ విజయవాడ, గుంటూరు, ఏలూరు, నరసాపురం, రాజమండ్రి ,రాజంపేట, అరుకు, తిరుపతి, హిందూపూర్, విశాఖపట్నం లోక్ సభ స్థానాలు కోరుతోంది. వీటిల్లో కనీసం 8 అయినా తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. విశాఖలో జివిఎల్ నరసింహారావు ఇప్పటికే వర్క్ చేసుకుంటున్నారు. విజయవాడ సీటు తనదేనని సుజనా చౌదరి చెప్పుకుంటున్నారు. రాజమండ్రి నుంచి పోటీ చేస్తానని పురందరేశ్వరి అధిష్టానానికి అర్జీ పెట్టుకున్నారు కూడా.

ఇక హిందూపూర్ (Hindupuram) నుంచి సత్య కుమార్, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు, ఏలూరు నుంచి.. తపన చౌదరి గ్రౌండ్లో పని చేసుకుంటున్నారు. బిజెపికి 8 కాకపోయినా కనీసం ఆరు స్థానాలైనా ఇచ్చి తీరాల్సిందే. చంద్రబాబు పిలక ఆల్రెడీ… మోడీ చేతిలో ఉంది. చెప్పింది చెప్పినట్లు వినాల్సిందే తప్ప… నో అని అనడానికి కుదరదు. మోడీ అమిత్ షాకు నచ్చజెప్పి 8 సీట్లను 6 కు తగ్గించి జనసేనకు రెండు ఇచ్చి మొత్తంగా ఎనిమిది సీట్లకు సర్దుబాటు చేయాలన్నది చంద్రబాబు ప్లాన్. మరి ఎనిమిది సీట్లలో ఇప్పటికే వర్క్ చేస్తున్న టిడిపి సీనియర్ నేతల పరిస్థితి ఏంటి? వాళ్లని ఎలా సర్దుబాటు చేయాలి..? ఇదే విషయంపై తెలుగుదేశం నేతలంతా మల్ల గుల్లాలు పడిపోతున్నారు. పైగా బీజేపీ అడుగుతున్న సీట్లన్నీ హార్డ్ కోర్ టిడిపి సీట్లు. నూటికి నూరు శాతం గెలిచేవి. అలాంటి స్థానాలు బిజెపికి ఇచ్చేసి ఓడిపోయే చోటు పోటీ చేసి పార్టీ ఉనికి లేకుండా చేసుకోవాలా అన్నది టిడిపి నేతల ఆందోళన. విజయవాడ ఎంపీ సీటు ఇప్పటికే కేశినేని చిన్నికి ప్రకటించారు. ఆ సీటు కావాలంటూ బీజేపీ పట్టుబడుతోంది. సుజనా చౌదరి తాను విజయవాడ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు.

విజయవాడ సీటు బీజేపీకీ ఇస్తే… కేశినేని చిన్నిని పెనమలూరు ఎమ్మెల్యే గా పంపిస్తామని టిడిపి అధిష్టానం చెబుతోంది. అక్కడ వరకు సరే… మరి మిగిలినవి ఎంపీ స్థానాల్లో పోటీ చేయాల్సిన సీనియర్ నేతలు ఏం చేస్తారు? ఎక్కడ సర్దుబాటు చేస్తారు? అందరి ప్రశ్న ఇదే. రాష్ట్రమంతా టిడిపి వేవ్ నడుస్తోంది, జనసేన, బీజేపీ అవసరం లేకుండానే పార్టీ గెలవగలిగే పరిస్థితి ఉంది. కానీ స్వీయ రక్షణ కోసం చంద్రబాబు… జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు అని టిడిపి లీడర్లు భావిస్తున్నారు. 35 అసెంబ్లీ స్థానాలు రెండు పార్టీలకి ఇచ్చేస్తే… పార్టీలో ముఖ్య కార్యకర్తలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇది టిడిపి నేతలను వేధిస్తున్న ప్రశ్న. రాయలసీమలో ఇప్పటికీ వైసీపీ చాలా బలంగా ఉంది అక్కడికి వెళ్లి పోటీ చేసి ఓడిపోవడం మినహా చేయగలిగేది ఏమీ లేదు. కొట్టాల్సిన సీట్లని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోనే ఉన్నాయి. అవేమో బీజేపీ, జనసేన… తమ కావాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నాయి. గెలవడం కోసం పొత్తులు పెట్టుకుంటున్నామా… పార్టీ ఉనికి దెబ్బతీసుకోడానికా అనే అయోమయ స్థితిలో టిడిపి అగ్రనేతలు ఉన్నారు.