TTD Darshanam : తిరుమల దర్శనానికి వసూళ్ళు…. వీఐపీ సిఫార్సులతో వైసీపీ నేతల దోపిడీ !
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో శ్రీవారి దర్శనాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. స్వామి వారి దర్శనం, కల్యాణం, ప్రసాదాలకు అడ్డగోలుగా టిక్కెట్లు పెంచేశారు. అన్యమత ప్రచారం కూడా యధేచ్ఛగా జరిగింది. ఇప్పుడు కొత్తగా దర్శనాల స్కామ్ బయటపడింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో శ్రీవారి దర్శనాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. స్వామి వారి దర్శనం, కల్యాణం, ప్రసాదాలకు అడ్డగోలుగా టిక్కెట్లు పెంచేశారు. అన్యమత ప్రచారం కూడా యధేచ్ఛగా జరిగింది. ఇప్పుడు కొత్తగా దర్శనాల స్కామ్ బయటపడింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి మంత్రులు, ఎమ్మెల్యేలకు VIP సిఫార్సులను అడ్డగోలుగా వాడేశారు అప్పటి లీడర్లు. ఒక్క ఎమ్మెల్యేకు 6 టిక్కెట్లు మాత్రమే సిఫార్సు చేసే అవకాశం ఉంటే… వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి రోజూ పదుల సంఖ్యలో… ఒక్కోసారి వంద మందికి మించి కూడా సిఫార్సు చేశారు. టీటీడీ ఛైర్మన్ కు గరిష్టంగా 150టిక్కెట్లు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటే… రోజుకి 500 నుంచి వెయ్యి దాకా కూడా ఇచ్చారు. భక్తులకు దర్శనానికి రికమండ్ చేస్తే తప్పేంటి అని అనుకోవచ్చు. కానీ VIP దర్శనాలకు భారీగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అప్పటి మంత్రి రోజా… తిరుమల VIP బ్రేక్ దర్శనాల రికమండేషన్ లో రికార్డులు సృష్టించారు. ఒకే రోజు 58 మందిని తిరుమల వెంకన్న VIP బ్రేక్ దర్శనానికి పంపారు పెద్దిరెడ్డి. ఫిబ్రవరి 13న 58 మందిని తన పేరుపై దర్శనానికి పంపిన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతకు ముందు ఒకే రోజు వంద మందికి పైగా బ్రేక్ దర్శనానికి పంపారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏప్రిల్ 30న 100 మందికి పైగా లిస్ట్ తో టీటీడీకి చెవిరెడ్డి సిఫార్స్ లెటర్ ఇచ్చారు. పెద్దిరెడ్డి, చెవిరెడ్డి బాటలోనే మిగిలిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు నడిచారు. కొండపై ఎక్కువ VIP దర్శనాలు చేయించిన వైసీపీ మంత్రుల్లో రోజానే టాప్ లో నిలిచారు. ప్రతి వారం తన వెంట భారీగా జనాన్ని తీసుకొని కొండపైకి వెళ్ళింది రోజా. పవిత్రమైన తిరుమల గిరిపై రాజకీయాలు మాట్లాడవద్దన్న సోయి కూడా ఉండేది కాదు… పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్ పై అక్కడే విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వీఐపీ బ్రేక్ దర్శనాలకు గతంలో రోజుకి 2 వేల వరకే పర్మిషన్ ఉంటే… వైసీపీ హయాంలో 6 వేల మందిని పంపారు. తిరుమలపై జగన్ టీమ్ అరాచకాలపై భక్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స్ విచారణలో దర్శనాల వ్యాపారం బయటపడుతోంది. వీఐపీ దర్శనాల చేయించినందుకు డబ్బులు వసూలు చేయడంపైనా విజిలెన్స్ విచారణ జరుగుతోంది.