Vidadala Rajini : షెల్లమ్మకు చీటీ షిరిగిపోయింది.. ఓటమి తప్పించుకోలేని విడదల రజనీ
ఏపీ మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజిని అలియాస్ చిడతల రజిని దారుణంగా ఓడిపోయింది. తన చిట్టి షెల్లెమ్మకు జగన్ నియోజకవర్గం మార్చినా ఉపయోగం లేకుండా పోయింది. గుంటూరు వెస్ట్ జనం విడదల రజిని అండ్ గ్యాంగ్ ని తరిమి తరిమి కొట్టారు.
ఏపీ మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజిని అలియాస్ చిడతల రజిని దారుణంగా ఓడిపోయింది. తన చిట్టి షెల్లెమ్మకు జగన్ నియోజకవర్గం మార్చినా ఉపయోగం లేకుండా పోయింది. గుంటూరు వెస్ట్ జనం విడదల రజిని అండ్ గ్యాంగ్ ని తరిమి తరిమి కొట్టారు. అంతకుముందు ఎగ్జిట్ పోల్ లోనూ ఆమె గుంటూరు వెస్ట్ నుంచి ఓడిపోతుందని వైసీపీకి అనుకూలంగా సర్వేలు ఇచ్చే ఆరా మస్తాన్ లాంటి వాడు కూడా చెప్పేశాడు. ఆరా మస్తాన్లు, ఆత్మసాక్షిలు ఓడుతుందని చెప్పకముందే… విడదల రజిని ఓటమి ఎప్పుడో డిసైడ్ అయింది. ఆ విషయం జగన్ కు, సజ్జల రామకృష్ణారెడ్డికి స్పష్టంగా తెలుసు. కానీ ఆమెకు సీటు లేదు…. కాదు ఇవ్వలేమనే ధైర్యం ఆ ఇద్దరికీ లేదు. అందుకే చిలకలూరిపేట నుంచి మార్చి గుంటూరు పశ్చిమకి తీసుకొచ్చారు ఈ మేకప్ మంత్రి గారిని. అయినా ఫలితం లేకుండా పోయింది. రజని దారుణంగా ఓడింది. నిజానికి విడదల రజనీపై నిలబెట్టిన టిడిపి అభ్యర్థి గల్లా మాధవి అంత బలమైన క్యాండిడేట్ ఏమీ కాదు. కానీ ఆమె చేతిలో కూడా రజిని 50వేల ఓట్ల తేడాతో ఓడింది.
సైబరాబాదులో చంద్రబాబు నాటిన మొక్కని అని చెప్పుకొని టీడీపీలో చురుగ్గా తిరిగిన రజిని… బాబుని మెప్పించడానికి ఒకానొక సమయంలో జగన్మోహన్ రెడ్డిని పిల్లల్ని ఎత్తుకుపోయే రాక్షసుడితో పోల్చింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సహకారంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రజిని.. ఆయనకే ఎర్త్ పెట్టింది. టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి… మహానాడులో అదిరిపోయే స్పీచ్ తో చంద్రబాబు దృష్టిలో పడింది. టీడీపీలో సీటు రాదని గ్రహించిన రజిని… ఓ మంచి రోజు చూసుకుని 2019 ఎన్నికలకి ముందు వైసీపీలో చేరి పత్తిపాటి పుల్లారావుకే సవాల్ విసిరింది. యాంటీ టీడీపీ వేవ్ లో అనూహ్యంగా చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచి… అక్కడి నుంచి హైస్పీడ్ తో చక్రం తిప్పడం ప్రారంభించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వానికే కాదు… విడుదల రజిని కూడా రాజకీయ సలహాదారుగా మారారు. సజ్జల అండదండలతో గుంటూరు జిల్లాని వణికించే స్థాయికి ఎదిగింది విడదల రజిని.
2019 ఎన్నికల్లో అన్ని రకాలుగా సహకరించిన నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలతో జగడానికి దిగింది. జగన్ కి అత్యంత సన్నిహితుడైన మర్రి రాజశేఖర్ ను రాజకీయంగా తొక్కేయడానికి ఎన్ని చేయాలో అన్నీ చేసింది. చిలకలూరిపేటలో మరో లీడర్ ఎదగకూడదు అనే రీతిలో సొంత పార్టీ నేతలపై కార్యకర్తలపై కేసులు పెట్టించింది. 33 ఏళ్ల విడదల రజిని అంత వేగంగా చిలకలూరిపేట రాజకీయాల్లో పావులు కదుపుతుంటే నోరెళ్ళబెట్టి చూశారు గుంటూరు జిల్లా రాజకీయ ఉద్దండులు. తన అనుమతి లేకుండా ఎంపీ కూడా తన నియోజకవర్గంలోకి అడుగుపెట్టొద్దని ఆదేశించింది రజిని. ఆమె రజక కులస్తురాలు. భర్త కుమారస్వామి కాపు. అమెరికన్ సిటిజన్. రజనీ రాజకీయాలతో తనకి సంబంధం లేదంటూనే చిలకలూరిపేటలో పాలిటిక్స్ ని కంట్రోల్ చేయసాగాడు భర్త కుమార స్వామి. రజనీ తనకంటూ సొంత గ్యాంగ్ ఏర్పాటు చేసుకుంది. అలాగే మీడియా చానల్స్ తో గట్టి సంబంధాలు, సొంత సోషల్ మీడియా టీం వీటన్నిటితో చెలరేగిపోయింది.
ఇంత కూడా రాజకీయ అనుభవం లేదు… మొదటిసారి ఎమ్మెల్యే… కానీ చిడతల రజిని వ్యవహార శైలి మాత్రం ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన నేతకు మించి ఉంటుంది. పార్టీలో ఎవరైనా తనకు ఎదురు తిరిగారా… వాళ్ళ మీద ఏదో కేసు పెట్టి ఇచ్చి లోపల వేయించేది. సొంత పార్టీ నేతలపైనే సోషల్ మీడియాలో అసత్యపు వార్తలు రాయించేది. సోషల్ మీడియాలోనూ తనకు వ్యతిరేకంగా ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ల పని అయిపోయినట్లే. విడదల రజనిపై హైకమాండ్ కు ఎన్ని కంప్లైంట్ లు చేసినా… అవన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి సీట్ దగ్గరే ఆగిపోయేవి. దాంతో ఇంక నేతలెవరూ నోరెత్తలేదు. ఎంపీ కృష్ణదేవరాయలు, రజిని బహిరంగంగానే తిట్టుకోవడం మొదలెట్టారు. ఒకట్రెండు సార్లు జగన్ వీళ్ళిద్దరికీ రాజీ చేయాలని ప్రయత్నించినా కుదరలేదు. రజినీ మరిది చిలకలూరిపేటలో సమాంతర ప్రభుత్వం నడిపాడు. అతగాడు వసూళ్లు అంతా ఇంతా కాదు. తనకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయనీ, అమెరికాలో కంపెనీలు ఉన్నాయని బడాయి కబుర్లు చెప్పే రజిని… నియోజకవర్గంలో కోట్లల్లో అవినీతి చేసింది. అన్నిటికన్నా ముఖ్యమైనది భూముల కొనుగోలు. సెంటు భూమిలో ఇల్లు నిర్మించే కార్యక్రమానికి రైతుల నుంచి తన బినామీల ద్వారా మొదట ఎకరం 10 లక్షలకి కొనిపించేది. ఆ తర్వాత అదే భూమిని ప్రభుత్వంతో ఎకరం 50 లక్షలు కొనిపించేది రజిని.
ఈ రకంగా వందల ఎకరాలు దొడ్డిదారిని ఎక్కువ రేటుకు ప్రభుత్వం చేత కొనిపించి భారీగా వెనకేసిందని ఆరోపణలొచ్చాయి. అదే సమయంలో జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా విడదల రజినీకి ఏకంగా వైద్య ఆరోగ్య మంత్రి శాఖ కట్టబెట్టేసాడు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన రెండున్నర యేళ్ళల్లోనే విడుదల రజిని ఏకంగా మంత్రి అయిపోయింది. పార్టీలో నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్లెవ్వరికీ దక్కని అవకాశం మేకప్ రజనీకి దక్కింది. మంత్రి అయ్యాక రజిని అరాచకాలు ఇంకా పెరిగాయి. చిలకలూరిపేటలో వైసిపి పూర్తిగా దెబ్బతింది. విడదల రజిని శృతిమించిన వ్యవహారాలను తట్టుకోలేక పార్టీ నాయకులే శ్రీరెడ్డితో రజనీకి వ్యతిరేకంగా అసహ్యకరమైన వీడియో చేయించి వదిలారు. అయినా రజిని హవా తగ్గలేదు. ఐప్యాక్ సర్వేలో ఆమెకు మళ్లీ చిలకలూరిపేట సీట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని తేలింది. కానీ రజనీకి సీటు ఇవ్వను అనే ధైర్యం జగన్ కి ఉందా? ఎంతోమంది నేతలు, ఎమ్మెల్యేలను కనుసైగతో గెటవుట్ అనే జగన్… విడదల రజినినీ మాత్రం అదే స్థాయిలో పక్కకు తప్పించలేకపోయారు.
సజ్జల రామకృష్ణారెడ్డి సన్నాయి నొక్కులు ఎలాగూ ఉంటాయి కాబట్టి… చిలకలూరి పేట నుంచి తప్పించి గుంటూరు వెస్ట్ కి చిడతల రజినినీ తరలించారు. 40 మంది ఎమ్మెల్యేలను పీకి అవతల పడేసిన జగన్… గెలవదని తెలిసినా విడదల రజనీకి సీటు నిరాకరించలేకపోయాడు. గుంటూరు వెస్ట్ లో ఆమెను గెలిపించడానికి వైసీపీ నేత అప్పిరెడ్డికి, మిగిలిన వాళ్ళందరికీ వార్నింగ్ లు వెళ్లాయి. అన్నిటికంటే చిత్రమైన విషయం ఏంటంటే? రజిని చిలకలూరిపేట ఖాళీ చేశాక అక్కడ మల్లెల రాజేష్ నాయుడికి మొదట వైసీపీ టికెట్ ప్రకటించారు. వెంటనే మరోసారి రజినీ తన పవర్ ఏంటో చూపించింది. రాజేష్ నాయుడు కి టికెట్ ఇవ్వద్దంటూ జగన్ని, సజ్జల రామకృష్ణారెడ్డిని ఆదేశించింది. ఆమె మాటే శాసనం కనుక కుక్కపిల్లలా తల ఊపుతూ… మల్లెల రాజేష్ నాయుడిని పీకి పడేసారు. రజనీ చెప్పిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు. మల్లెల రాజేష్ నాయుడు వెంటనే టీడీపీలో చేరి రజనికి వ్యతిరేకంగా గుంటూరులో పని చేశారు. నిజానికి చిలకలూరిపేటలో 2019లో రజనీ గెలవడానికి మల్లెల రాజేష్ నాయుడు కృషి చాలా ఉంది.
అప్పట్లో తన ఆరు కోట్ల రూపాయలు రజనీకి ఇచ్చాననీ, అందులో సగం మాత్రమే వెనక్కి ఇచ్చిందని మిగిలిన డబ్బులు అడిగితే బెదిరిస్తోందని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి రాజేష్ నాయుడు చెప్పాడు కూడా. తాను గుంటూరులో సీటు సంపాదించుకోవడమే కాదు… చిలకలూరిపేటలో ఎవరు ఉండాలో కూడా నిర్ణయించే శక్తిగా ఎదిగింది రజిని. చిడతల రజనీ కోసం… జగన్ తనను ఎన్ని రకాలుగా అవమానించారో నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు చాలామంది దగ్గర చెప్పుకొని బాధపడ్డారు. ఫైనల్ గా వైసీపీని వదిలి టిడిపిలో చేరి మళ్లీ ఎంపీగా ఎన్నికయ్యాడు లావు కృష్ణదేవరాయలు. గెలిచే ఒక ఎంపీ కాండిడేట్ ని కూడా వదులుకున్నారు కానీ విడుదల రజనీపై మాత్రం ఈగ వాలనివ్వలేదు జగన్, సజ్జల. చిలకలూరిపేటను వదిలి గుంటూరు సీటు సంపాదించాక కూడా రజిని తన వికృత చేష్టలు ఆపలేదు. గుంటూరు వెస్ట్ లో ఓటర్లను కలవాల్సింది పోయి… టీడీపీ, జనసేన నేతలను కొనడం మొదలుపెట్టింది.
జనసేన టౌన్ అధ్యక్షుడిని ఏకంగా వైసీపీలో చేర్చుకుంది. వెస్ట్ లో అంతకు ముందు గెలిచిన మద్దాలి గిరి…నామ్ కే వాస్తేగా పక్కన పెట్టుకొని… పూర్తిగా తన సొంత సైన్యాన్ని ఎన్నికలకి ఉపయోగించింది. చిలకలూరిపేటలో చెల్లని రూపాయి గుంటూరు వెస్ట్ లో ఎలా చెల్లుతుందని జగన్ అనుకున్నాడు?. రజినీ ఎక్కడికి వచ్చినా అవే చిల్లర వేషాలు కదా. విడుదల రజిని గెలిపించాలని జగన్, సజ్జల ఎంత పరితపించినా జనం తిరస్కరించారు. అంతగా పాపులారిటీ కూడా లేని గల్లా మాధవిని 50 వేలకు పైగా మెజారిటీతో గెలిపించారు. 28 ఏళ్లకే తన మాటల చాతుర్యంతో, చమక్కులతో ఎమ్మెల్యే, మంత్రి అయిపోయిన విడుదల రజిని చూపుడువేలుతో అందర్నీ శాసించాలనుకున్నారు. తన అతి తెలివితేటలు, సోషల్ మీడియా వ్యూహాలతో, 2024 లో ఏకంగా డిప్యూటీ సీఎం అయి పోదామని కలలు కన్నారు. కానీ జనం ముందు ఓడిపోయారు. రజనీ విషయంలో పార్టీ నేతల నోళ్లు మూయించగలిగారు గానీ… జనం తీర్పుని మార్చలేకపోయారు జగన్, సజ్జల.