Vanga Gita, Pawan Kalyan : కొత్త ఆయుధం సిద్ధం చేసిన వంగా గీత.. పిఠాపురంలో పవన్ పరిస్థితేంటి ?
పిఠాపురం (Pithapuram) .. ఇప్పుడు ఏపీ ఆసక్తి అంతా ఈ నియోజకవర్గం మీదే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో రెండు నియోజవర్గాల్లో ఓడిపోయిన పవన్.. ఈసారి అసెంబ్లీ మెట్లు ఎక్కుతారా.. పిఠాపురం (Pawan Kalyan) లో గెలుస్తారా లేదా.. గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారు.

Vanga Gita prepared a new weapon.. What is Pawan's situation in Pithapuram?
పిఠాపురం (Pithapuram) .. ఇప్పుడు ఏపీ ఆసక్తి అంతా ఈ నియోజకవర్గం మీదే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో రెండు నియోజవర్గాల్లో ఓడిపోయిన పవన్.. ఈసారి అసెంబ్లీ మెట్లు ఎక్కుతారా.. పిఠాపురం (Pawan Kalyan) లో గెలుస్తారా లేదా.. గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారు.. అసలు పిఠాపురం ఓటర్ మనసులో ఏముంది.. ఇలా అందరి చర్చ ఇప్పుడు ఆ నియోజకవర్గం చుట్టే తిరుగుతోంది. మెగా ఫ్యామిలీ సెలబ్రిటీలు, టీవీ సీరియల్ యాక్టర్లు.. జబర్దస్త్ జోకర్లు.. ఇలా అందరూ పిఠాపురంలోనే కనిపిస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
ఇక అటు వైసీపీ (YCP) కూడా తగ్గేదే లే అంటోంది. మండలానికి ఒక ఇంచార్జిని నియమించింది. పవన్‌కు చెక్ పెట్టి తీరుతామని సవాల్ విసురుతోంది. పిఠాపురంలో కాపు ఓటర్లు ఎక్కువ. ఇది జనసేనకు ప్లస్ అవుతుందనే చర్చ జరుగుతున్న సమయంలో.. వంగా గీత (Vanga Gita) కొత్త ఆయుధం అందుకున్నారు. మంచి జరిగింది అంటేనే ఓటు వేయండి అని ఇన్నాళ్లు జగన్‌తో పాటు జనాలకు మాట వినిపించిన వంగా గీత.. ఇప్పుడు లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అంశాన్ని తెరమీదకు తీసుకువస్తున్నారు. పవన్‌ను ఓటేస్తే.. ఓటు వృథా కావడమే అంటూ.. జనాల్లోకి వెళ్తున్నారు. పిఠాపురంలో గెలిచినా.. పవన్ ఎవరికీ అందుబాటులో ఉండరని.. ఆయనను కలవాలంటే హైదరాబాద్ వెళ్లాలని.. లేదంటే షూటింగ్ లొకేషన్ ఎక్కడో కనుక్కొని వెళ్లాల్సి వస్తుందని.. వంగా గీత సెటైర్లు పేలుస్తున్నారు.
ఇప్పుడు పవన్ తరఫున ప్రచారం చేస్తున్న యాక్టర్లు, కమెడియన్లు, డ్యాన్స్‌మాస్టర్లు ఎవరు కూడా.. ఆ తర్వాత కంటికి కనిపించరని.. కనీసం అండగా ఉండేందుకు కూడా ముందుకు రారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని.. వంగా గీత జనాల్లోకి వెళ్తున్నారు. లోకల్ వర్సెస్ నాన్ లోకల్ నినాదం వర్కౌట్ అయితే.. పవన్‌కు కాస్త ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదని మరికొందరి మాట. ఐతే జనసేన కూడా వైసీపీ విమర్శలుక స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. పిఠాపురంలో పవన్ ఇల్లు తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూనే.. జనం కోసం నడిచే మనిషి.. జనాలను వదిలి దూరంగా ఉంటారంటే ఎలా నమ్ముతారు అంటూ బంతిని.. ఓటర్ల కోర్టులోకి వదిలేస్తున్నారు జనసేన నేతలు.