Vijay Saireddy: విజయ్ సాయిరెడ్డి ఎక్కడ ? కేసుల భయంతో ఢిల్లీలోనే మకాం !

వైసీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగాడు... జగన్ తర్వాత విజయ్ సాయి రెడ్డే నెంబర్ 2. ఏపీలో వైసీపీ ఓడిపోయి... 11 సీట్లకు పడిపోయింది... విజయ్ సాయి ఎంపీగా పోటీ చేసిన నెల్లూరులోనూ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడారు. అప్పటి నుంచి ఆయన ఏపీలో కనిపించడం లేదు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 28, 2024 | 03:52 PMLast Updated on: Jun 28, 2024 | 3:52 PM

Vijay Saireddy

వైసీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగాడు… జగన్ తర్వాత విజయ్ సాయి రెడ్డే నెంబర్ 2. ఏపీలో వైసీపీ ఓడిపోయి… 11 సీట్లకు పడిపోయింది… విజయ్ సాయి ఎంపీగా పోటీ చేసిన నెల్లూరులోనూ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడారు. అప్పటి నుంచి ఆయన ఏపీలో కనిపించడం లేదు. జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో కూడా పాల్గొనలేదు. మీడియాకు అస్సలే కనిపించట్లేదు. విజయ్ సాయి రెడ్డి ఢిల్లీలో ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి దాకా ఏపీలో వైసీపీ అధికారంలో ఉండటంతో… ఈడీ, సీబీఐ కేసుల నుంచి తప్పించుకొని తిరిగారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు… కేసుల భయం వెంటాడుతోంది. అందుకే కేంద్రంలో బీజేపీ పెద్దలతో మంతనాల చేస్తున్నట్టు తెలుస్తోంది.
2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా విజయ్ సాయి రెడ్డి ఇలాగే చేశాడు. ఢిల్లీలో కూర్చొని… టీడీపీ, బీజేపీ మధ్య గ్యాప్ పెంచడానికి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి. NDA నుంచి టీడీపీ వెళ్ళిపోయే దాకా… రెచ్చగొట్టే ధోరణిలో ట్వీట్స్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం వైసీపీ రాజ్యసభపక్ష నేతగా ఉన్నారు విజయ్ సాయి రెడ్డి.
ఏపీలో టీడీపీ ఆధ్వర్యంలోని NDA కూటమి అధికారంలో ఉండటంతో… కేసులు మళ్ళీ బయటకు వస్తాయని తెలుసు. అందుకే తనను తాను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రుల ఇళ్ళకు వెళ్ళి పరిచయాలు చేసుకుంటున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఎంపీగా ఉండి… ఏపీకి ఏనాడూ ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చినట్టు లేదు. రైల్వే మంత్రిని కలసి ఏపీకి ప్రాజెక్టులు అడుగుతున్నట్టు X లో ట్వీట్స్ పెడుతూ తానేదో పొడుస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు విజయ్ సాయి రెడ్డి. కానీ గత ఐదేళ్ళుగా ఇదే ట్విట్టర్లో ఏనాడు ఏపీ గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేసేవాడు. ఇప్పుడు మాత్రం సీబీఐ, ఈడీ కేసుల నుంచి బయటపడటానికి కేంద్ర పెద్దలతో మంతనాలు చేస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తోంది. ఆయన లాబియింగ్ ఎంత వరకూ పనిచేస్తుందో చూడాలి.