Vijaysai lands : ఆ ముగ్గుర్నీ కలిపింది… ప్రేమ సమాజం భూములే !
వైసీపీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డికి విశాఖ ఏరియాలో పార్టీని నిలబెట్టే బాధ్యతలను అప్పగించారు జగన్. అప్పటి నుంచి... అక్కడ విలువైన భూములను విజయ్ సాయి రెడ్డి, వైసీపీ నేతలు కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయి. అయితే విజయసాయి రెడ్డి, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, లాయర్ సుభాష్ రెడ్డి... ఈ ముగ్గురూ కలవడానికి కారణం... ప్రేమ సమాజం భూములే. ఈ భూముల వెనక పెద్ద స్కామ్ జరిగిందనీ... విచారణ జరిపించాలని విశాఖ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డికి విశాఖ ఏరియాలో పార్టీని నిలబెట్టే బాధ్యతలను అప్పగించారు జగన్. అప్పటి నుంచి… అక్కడ విలువైన భూములను విజయ్ సాయి రెడ్డి, వైసీపీ నేతలు కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయి. అయితే విజయసాయి రెడ్డి, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, లాయర్ సుభాష్ రెడ్డి… ఈ ముగ్గురూ కలవడానికి కారణం… ప్రేమ సమాజం భూములే. ఈ భూముల వెనక పెద్ద స్కామ్ జరిగిందనీ… విచారణ జరిపించాలని విశాఖ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
విశాఖలో ప్రేమ సమాజానికి వేల కోట్ల విలువైన భూములున్నాయి. వాటి వివరాలు కావాలంటూ విజయ్ సాయి రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. అసిస్టెంట్ కమిషనర్ హోదాలో శాంతి ఈ ఇష్యూలోనే విజయ్ సాయి రెడ్డి దగ్గరకు వెళ్ళారు. ఆయన ఆదేశాలకంటే వేగంగా… పనులు పూర్తి చేయించి శభాష్ అనిపించుకున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని ప్రేమ సమాజానికి చెందిన సాయి రిసార్ట్స్ భూమిని యాజమాన్యం నుంచి తప్పించేందుకు… విజయసాయిరెడ్డితో శాంతి చేతులు కలిపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆ టైమ్ లోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని అంటున్నారు. విజయసాయి వెంట ఉండే ప్రభుత్వ న్యాయవాది సుభాష్ కూడా వీళ్ళకి దగ్గరయ్యాడు. ఈ ముగ్గుర్నీ కలిపింది మాత్రం ప్రేమ సమాజం భూములే.
విశాఖలో అనాధలు, వృద్ధులకు సేవలకు అందిచేందుకు ఏర్పడిందే ప్రేమ సమాజం ట్రస్ట్. దీనికి ఉత్తరాంధ్రలో విలువైన ఆస్తులున్నాయి. కొన్ని ఆస్తులను లీజుకు కూడా ఇచ్చారు. వాటి మీద వచ్చే ఆదాయంతో… అనాధ, వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ విలువైన భూములను కొట్టేయాలన్న ప్లాన్ రెడీ చేశారు. 2020 అక్టోబర్ లో దేవాదాయ శాఖ ఈ భూముల్ని స్వాధీనం చేసుకుంది. దాంతో ప్రేమ సమాజానికి వచ్చే ఆదాయం పడిపోవడంతో… వృద్ధులు, అనాథలకు సేవలు అందించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రెస్ మీట్ లో శాంతి కూడా ప్రేమ సమాజం భూముల కోసమే విజయ్ సాయిరెడ్డిని కలిసినట్టు చెప్పింది. శాంతి వ్యవహారం రచ్చకెక్కడంతో కూటమి ప్రభుత్వం ప్రేమ సమాజం భూముల వ్యవహారంపై సీరియస్ గా ఉంది. శాంతి హయాంలో జరిగిన దేవాలయ భూముల లీజులు, అద్దె చెల్లింపులపైనా దృష్టిపెట్టింది. ఇప్పటికే శాంతిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దేవాలయ భూములను అక్రమంగా వైసీపీ నేతలకు కట్టబెట్టినట్టు రుజువైతే శాంతిని డిస్మిస్ చేసే అవకాశాలున్నాయి. ఆ వైసీపీ లీడర్లను జైలుకు పంపాలని కూడా ప్రభుత్వం డిసైడ్ అయింది.