Kadapa, YS Sharmila : కడపలో షర్మిల పరిస్థితేంటి ? డిపాజిట్ కోల్పోవడం ఖాయమా..
ఏపీలో ఈసారి ఎన్నికలు మరింత ఆసక్తిగా కనిపించడానికి ప్రధాన కారణం.. అన్నకు షర్మిల ఎదురుతిరగడం.. కాంగ్రెస్‌లో చేరి, పార్టీ పగ్గాలు అందుకొని.. కడప గడపలో పోటీ చేయడం.. దీనికితోడు లాస్ట్ మినిట్‌లో విజయమ్మ వీడియో బైట్ ఇచ్చి మరీ.. షర్మిలను గెలిపించాలని కోరడంతో.. కడపలో ఫలితం ఎలా ఉండబోతుందనే ఆసక్తి కనిపిస్తోంది. దీంతో మిగతా నియోజకవర్గాలన్నీ ఒకెత్తు.. కడప మాత్రం మరో ఎత్తు అనే స్థాయిలో కనిపించింది సీన్.

What is Sharmila's situation in Kadapa? Deposit is sure to be lost..
ఏపీలో ఈసారి ఎన్నికలు మరింత ఆసక్తిగా కనిపించడానికి ప్రధాన కారణం.. అన్నకు షర్మిల ఎదురుతిరగడం.. కాంగ్రెస్‌లో చేరి, పార్టీ పగ్గాలు అందుకొని.. కడప గడపలో పోటీ చేయడం.. దీనికితోడు లాస్ట్ మినిట్‌లో విజయమ్మ వీడియో బైట్ ఇచ్చి మరీ.. షర్మిలను గెలిపించాలని కోరడంతో.. కడపలో ఫలితం ఎలా ఉండబోతుందనే ఆసక్తి కనిపిస్తోంది. దీంతో మిగతా నియోజకవర్గాలన్నీ ఒకెత్తు.. కడప మాత్రం మరో ఎత్తు అనే స్థాయిలో కనిపించింది సీన్. అన్నాచెల్లెళ్ల యుద్ధమో, రెండు పార్టీల మధ్య సమరమో కాదిది.. ఒక రకంగా వైఎస్ వారసత్వం కోసం జరిగిన ఎన్నికలు. షర్మిల కాంగ్రెస్ తరఫున పోటీ చేసినంత మాత్రాన తక్కువ తీసుకోవడానికి లేదు. సొంత జిల్లాలో పోటీ చేయడంతో.. కచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉండబోతుందన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
ఇలాంటి పరిణామాల మధ్య… కడప లోక్‌సభ పోలింగ్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోది. కొంతవరకు క్రాస్ ఓటింగ్ జరిగిందనే టాక్ వినిపిస్తోంది. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో కొంతవరకు క్రాస్ ఓటింగ్ జరిగిందని సమాచారం. రెండు నుంచి మూడుశాతం ముస్లింల ఓట్లు కూడా కాంగ్రెస్‌కు పడ్డాయనే చర్చ జరుగుతోంది. ఐతే ఈ క్రాస్ ఓటింగ్ షర్మిలకు కలిసొస్తుందా.. ఈ ఎన్నికల్లో ఆమెను గట్టెక్కిస్తుందా అంటే మాత్రం.. లేదనే సమాధానమే వినిపిస్తోంది. ఆ కొద్దిపాటి క్రాన్ ఓటింగ్‌తో వైసీపీ విజయాన్ని ఆపడం సాధ్యం కాదు అనే చర్చ జరుగుతోంది. ఐతే క్రాస్ ఓటింగ్‌కు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయ్. షర్మిల మీద సానుకూలత ఒక కారణం కాగా.. చివరి నిమిషంలో విజయమ్మ చేసిన విన్నపాలు మరో కారణంగా కనిపిస్తోంది.
జగన్ చెప్పినట్లు.. షర్మిలకు డిపాజిట్ దక్కదు అనేది నిజం కాకపోయినా.. అంతో ఇంతో ఓట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఐతే ఒక్కటి మాత్రం నిజం.. కడప లోక్‌సభలో వైసీపీ మెజారిటీ.. షర్మిల ప్రయత్నాలను డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. 2019 ఎన్నికలతో కంపేర్ చేస్తే.. ఒక్క ఓటు మెజారిటీ తగ్గినా.. షర్మిల విజయం సాధించినట్లే అనే టాక్ వినిపిస్తోంది. 2019లో అవినాశ్ రెడ్డికి 3లక్షల 80వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ఇప్పుడు దానిలో ఏ మాత్రం తగ్గినా.. జగన్ మీద షర్మిల పైచేయి సాధించినట్లే అనే చర్చ నడుస్తోంది. మెజారిటీ తగ్గితే.. వివేకా కేసులో అవినాశ్ హస్తం ఉందని.. జగన్ ఆయనను వెనకేసుకొస్తున్నారని.. కడప జిల్లా జనాలు నమ్మరానే అనుకోవాలని.. మరికొందరు అభిప్రాయపడుతున్నారు.