బెజవాడలో భారీ వర్షానికి “ఫ్లయింగ్ రివర్స్” కారణమా…?

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. అసలు ఈ అత్యంత భారీ వర్షాలకు కారణం ఏంటీ...? ఆకాశంలో ఏర్పడే నదులు. అవును మీరు విన్నది నిజమే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 31, 2024 | 06:29 PMLast Updated on: Aug 31, 2024 | 6:29 PM

What Is The Reason For Heavy Rain Effect In Vijayawada

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. అసలు ఈ అత్యంత భారీ వర్షాలకు కారణం ఏంటీ…? ఆకాశంలో ఏర్పడే నదులు. అవును మీరు విన్నది నిజమే. ఆకాశంలో కూడా నదులు ఉంటాయి, మన భూమిపైన ఉన్నట్టే మేఘాల్లో కూడా నదులు ఉన్నాయి. వాటినే ఫ్లయింగ్ రివర్స్ అంటారు. అసలు అవి ఎలా ఏర్పడతాయో, ఆ నదులకు కారణం ఏంటో తెలుసా…? గ్లోబల్ వార్మింగ్. ఎస్ గ్లోబల్ వార్మింగ్ కారణం. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో తేమ భారీగా పెరిగిపోతుంది. మహా సముద్రాలలో నీరు వేడెక్కినప్పుడు భారీ మొత్తంలో నీరు ఆవిరిగా మారి ఆకాశంలో కంటికి కనపడని ఆవిరి పాయలు ఏర్పడతాయి.

ఈ నదులు భారీగా ఏర్పడతాయి… వేడి ప్రాంతం నుంచి చల్లని వాతావరణం వైపు అవి కదిలి… అక్కడ భారీ వర్షానికి కారణం అవుతాయి. దీని ప్రభావంతో మంచు కురడం గాని అత్యంత భారీ వర్షాలు కురవడం గాని జరుగుతుంది. అందుకే వర్షాల తీవ్రత ఇప్పుడు పెరుగుతుంది. మొన్న కేరళలో జరిగింది అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది కూడా అదే.

భూమి మధ్యస్థ అక్షాంశాలు అయిన… కర్కాటక రేఖ, ఆర్కటిక్ వలయం అలాగే మకర రేఖ, అంటార్కటికా వలయం మధ్య ఉన్న ప్రాంతంలో కదిలే నీటి ఆవిరిలో 90 శాతం ఈ ఫ్లయింగ్ రివర్స్ మోసుకుని వెళ్తూ ఉంటాయి. అంటే… ప్రపంచంలోనే అతిపెద్ద నది అయిన అమెజాన్ సాధారణ ప్రవాహం కంటే… రెండింతలు ఎక్కువగా ఫ్లైయింగ్ రివర్స్ మోసుకుని వెళ్తాయి. భూమి ఇప్పుడు వేడెక్కడంతో ఈ ఫ్లయింగ్ రివర్స్ భారీగా ఏర్పడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ను అదుపు చేయకపోతే మాత్రం పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన రుతుపవనాల ప్రభావం పెరగడానికి హిందూ మహా సముద్రం వేడెక్కడమే కారణం. గత 20 ఏళ్ళలో ఏర్పడిన భారీ వరదలకు 80 శాతం ఫ్లయింగ్ రివర్స్ కారణం.