VANGAVEETI RADHA : జనసేనలోకి వంగవీటి రాధ ఏ సీటు ఇస్తారంటే… !
ప్రస్తుతం టీడీపీ (TDP) లో ఉన్న వంగవీటి రాధా (Vangaveeti Radha) త్వరలో జనసేనలోకి (Janasena) చేరతారని టాక్ నడుస్తోంది.

What seat will Vangaveeti Radha give in Janasena... !
ప్రస్తుతం టీడీపీ (TDP) లో ఉన్న వంగవీటి రాధా (Vangaveeti Radha) త్వరలో జనసేనలోకి (Janasena) చేరతారని టాక్ నడుస్తోంది. విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లో ఏదో ఒక అసెంబ్లీ సీటు తనకు తెలుగుదేశం అధిష్టానం ఇస్తుందని రాధా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ రెండు సీట్లకు బాబు వేరే అభ్యర్థులను ప్రకటించడంతో మరోసారి రాధాకు మొండిచెయ్యి ఎదురైంది. దాంతో ఆయన ఈసారి ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కూటమి అభ్యర్థుల ప్రచారానికే పరిమితం అవుతారన్న టాక్ నడిచింది. కానీ అనుకోకుండా జనసేన రూపంలో వంగవీటి రాధాకు అదృష్టం కలిసొస్తోంది. ఆయనకు జనసేనలో మచిలీపట్నం ఎంపీ సీటు లేదంటే అవనిగడ్డ ఎమ్మెల్యే సీటుల్లో ఏదో ఒకటి ఇస్తారని తెలుస్తోంది.
వంగవీటి రాధాకు జనసేనలోకి రప్పించేందుకు మచిలీపట్నం ఎంపీ బాలశౌరియే గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి (Balashauriye) రేసులో ఉన్నారు. కూటమి పొత్తులో భాగంగా అవనిగడ్డ అసెంబ్లీ సీటు జనసేనకే దక్కింది. మచిలీపట్నం ఎంపీతో పాటు అవనిగడ్డ అసెంబ్లీ స్థానంలో రాధా కోసం జనసేన అధిష్టానం సర్వే నిర్వహిస్తోందట. అందుకే బాలశౌరికి ఇంకా ఎంపీ టిక్కెట్ కన్ఫమ్ చేయలేదని అంటున్నారు. వంగవీటి రాధా ఇప్పటికే నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తో పాటు ఇతర జనసేన లీడర్లతో సమావేశం అయ్యారు. అవనిగడ్డలోనే రాధా నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. కానీ అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ వర్గం నిరసనలు చేస్తోంది. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే రిజైన్ చేస్తామంటున్నారు. అసమ్మతి స్వరాల మధ్య రాధా అవనిగడ్డలో నిలబడతారా… లేదా…. అసంతృప్తులను బాబు ఎలా బుజ్జగిస్తారన్నది చూడాలి.