YCP 5TH LIST : ఐదో లిస్ట్ ఎప్పుడు ? వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్…టెన్షన్…
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారం చేపట్టేందుకు వైసీపీ (YCP) అధినేత, సీఎం జగన్ (CM Jagan)... నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతల్లో 59 మంది దాకా అభ్యర్థులను మార్చారు.
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారం చేపట్టేందుకు వైసీపీ (YCP) అధినేత, సీఎం జగన్ (CM Jagan)… నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతల్లో 59 మంది దాకా అభ్యర్థులను మార్చారు. వైసీపీ నాలుగో లిస్ట్ (YCP Fourth List) బయటకు వచ్చి… 10 రోజులు దాటినా ఇంకా ఐదో జాబితా విడుదల కాకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములను పరిశీలించి మిగిలిన అన్ని నియోజకవర్గాలను ఒకేసారి ప్రకటించే అవకాశం కూడా ఉందంటున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల అందరి జాతకాలు రిలీజ్ చేసే ఛాన్సుంది.
వైసీపీలో ఇప్పటికీ నాలుగు జాబితాలు బయటకు వచ్చాయి. 58 అసెంబ్లీ, 10 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేశారు వైసీపీ చీఫ్ జగన్. వీటిల్లో కొందరు కొత్తవారికి అవకాశం రాగా, కొంతమంది సిట్టింగ్స్ తమ స్థానాలు కోల్పోయారు. ఇంకొందరిని వేరే అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఎంపీ సీట్లకు ట్రాన్స్ ఫర్ చేశారు జగన్. ఇంకా వైసీపీ లిస్టులో 15 ఎంపీ, 117 అసెంబ్లీ స్థానాలను ప్రకటించాల్సి ఉంది. ఈ ఐదో విడత జాబితాలో భారీగానే పేర్లు బయటకు వచ్చే ఛాన్సుంది. అందుకే తాడేపల్లిలో సీఎం క్యాంపాఫీసుకు వైసీపీ అభ్యర్థులు క్యూ కడుతున్నారు.
ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, చెట్టి ఫాల్గుణ.. సోమవారం నాడు సీఎంఓ ఆఫీసుకు వచ్చారు. అలాగే కొందరు టీడీపీ రెబల్స్ కూడా వచ్చిన జగన్ ను కలుస్తున్నారు. ఈసారి వచ్చే లిస్టులో భారీగా మార్పులు జరిగే ఛాన్సుంది. మంత్రులు, ఎమ్మెల్యేల్లో కొందరిని ఎంపీలుగా దింపే అవకాశముంది. కొందరు కొత్త అభ్యర్థులను కూడా నిలబెట్టే ఛాన్సుందిః. అందుకోసం ఆయా నియోజక వర్గాల్లో ఉన్న సామాజిక సమీకరణాలను కూడా జగన్ లెక్కలోకి తీసుకుంటున్నారు. ఎంపీ అభ్యర్థులుగా డబ్బులు పెట్టుకోగలిగిన స్థోమతను కూడా పరిశీలిస్తున్నారు.
ఈసారి సీనియర్ నేతలు కొందరికి టిక్కెట్లు నిరాకరించే ఛాన్సుందని అంటున్నారు. వాళ్ళకి నియోజకవర్గాల్లో ఎదురు గాలి వీస్తోందని సర్వేలు చెబుతున్నాయి. కానీ ఉన్నట్టుండి కొత్తవాళ్ళని తీసుకొస్తే సీనియర్లు ఆమోదించకపోవచ్చు. అందుకే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాలపై జగన్ ఒకటి రెండు సార్లు ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏకాభిప్రాయం సాధ్యం కాకపోతే మరికొందరు రెబల్స్ తయారవుతారని సీనియర్లు చెబుతున్నారు. ఫిఫ్త్ లిస్ట్ రిలీజ్ అయితే మాత్రం… వైసీపీలో కీలక పరిణామాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేనకు వలసలు కూడా పెరిగే ఛాన్సుంది.