CI OVERACTION : వారాహి పూజ జరుగుతుంటే బూట్లతో… ఆ సీఐ దూలతీర్చిన పవన్ కల్యాణ్
వైసీపీ ప్రభుత్వం దిగిపోయినా ఇంకా ఆ మైకం నుంచి బయటపడటం లేదు కొందరు పోలీస్ అధికారులు. అప్పట్లో జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు అంటే చులకనగా చూసిన ఓ పోలీస్ అధికారి... ఇప్పుడు కూడా అదే దురుసు ప్రవర్తన... లెక్కలేనితనంతో ఓవరాక్షన్ చేశాడు.
వైసీపీ ప్రభుత్వం దిగిపోయినా ఇంకా ఆ మైకం నుంచి బయటపడటం లేదు కొందరు పోలీస్ అధికారులు. అప్పట్లో జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు అంటే చులకనగా చూసిన ఓ పోలీస్ అధికారి… ఇప్పుడు కూడా అదే దురుసు ప్రవర్తన… లెక్కలేనితనంతో ఓవరాక్షన్ చేశాడు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపాఫీస్ లో ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించాడు. చివరకు ట్రాన్స్ ఫర్ ఆర్డర్స్ చేతికి వచ్చాయి.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపాఫీసులో ఓవరాక్షన్ చేసిన మంగళగిరి సీఐ శ్రీనివాసరావుపై వేటు పడింది. విజయవాడలో ఉన్న పవన్ కల్యాణ్ క్యాంపాఫీసులోకి ముందుగా ఎలాంటి అపాయింట్ మెంట్ లేకుండా వెళ్ళాడు సీఐ. భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నా… మీరేంటి నాకు చెప్పేది… అనే ధీమాతో వాళ్ళపై దురుసుగా ప్రవర్తించాడు. ఆ టైమ్ లో పవన్ కల్యాణ్ వారాహి దీక్షలో భాగంగా పూజలు చేస్తున్నారు. అందుకే సిబ్బంది కొద్దిసేపు వెయిట్ చేయమని సీఐని కోరారు. కానీ సీఐ శ్రీనివాసరావు ఎవరు చెప్పినా వినకుండా… బూట్లతోనే పవన్ పూజా గదిలోకి వెళ్ళాడు. సీఐ వైఖరిపై మండిపడ్డ డిప్యూటీ సీఎం ఆఫీస్ సిబ్బంది… పోలీస్ ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేశారు. దాంతో సీఐ శ్రీనివాసరావును విధుల నుంచి తప్పిస్తూ గుంటూరు రేంజ్ IG సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశాలిచ్చారు.
త్రిపురాంతకం సీఐ వినోద్ కుమార్ ను మంగళగిరి టౌన్ సీఐగా నియమించారు. మంగళగిరి టౌన్ సీఐ శ్రీనివాసరావుపై గతంలోనూ అనేక ఆరోపణలు చాలానే వచ్చాయి. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యం చేసినట్టు చెబుతారు. గత మార్చి నెలలో… జనసేన ఆఫీసులో పనిచేసే సిబ్బంది నివసించే అపార్టమెంట్స్ లో ఓ రోజు అర్థరాత్రి వెళ్ళి తనిఖీల పేరుతో హడావిడి చేశాడు. ఇద్దరు SIలు… మరికొందరు సివిల్ డ్రెస్ లో ఉన్న యువకులను వెంటబెట్టుకొని వెళ్ళాడు సీఐ శ్రీనివాసరావు. అర్థరాత్రి ఈ తనిఖీలు ఏంటని అడిగిన జనసైనికులపై దౌర్జన్యం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. తమపై సీఐ దురుసుగా ప్రవర్తించారంటూ జనసేన నేతలు డీఎస్పీకి వినతిపత్రం కూడా ఇచ్చారు.
సీఐపై జనసేన పార్టీ ఆఫీస్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదును అప్పట్లో డీఎస్పీ అంత సీరియస్ గా తీసుకోలేదు. అకానాలెడ్జ్ మెంట్ ఇవ్వలేదనీ… ఫోటో తీసుకునేందుకు కూడా ఒప్పుకోలేదని జనసేన లీగల్ సెల్ అప్పట్లో ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చింది. అదే మంగళగిరి టౌన్ సీఐ శ్రీనివాసరావు ఇప్పుడు కూడా… డిప్యూటీ సీఎం సిబ్బంది ఆఫీసుపై దురుసుగా ప్రవర్తించడం… బూట్లతోనే పూజ జరుగుతున్న గదిలోకి వెళ్ళడం వివాదస్పదమైంది. దాంతో పోలీస్ అధికారులు ఆ సీఐపై బదిలీ వేటు వేశారు.