YS Sharmila, Raja Reddy wedding : జగన్‌ మామయ్య ఎక్కడ? రాజారెడ్డి పెళ్లికి జగన్‌ గైర్హాజరు

ఏపీ కాంగ్రెస్‌ (AP Congress) అధ్యక్షురాలు షర్మిల కొడుకు పెళ్లి (Sharmila's son's wedding) చాలా గ్రాండ్‌గా జరిగింది. రాజస్థాన్‌ (Rajasthan) లోని జోధ్‌పూర్‌ (Jodhpur) లో ఉండే ఓ ప్యాలెస్‌లో రాజారెడ్డి ప్రియ వివాహం జరిగింది. ఈ పెళ్లికి షర్మిల (Sharmila) దంపతులు దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టినట్టు రాజకీయా వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 18, 2024 | 10:42 AMLast Updated on: Feb 18, 2024 | 10:53 AM

Where Is Jagans Uncle Jagan Will Not Attend Raja Reddys Wedding

ఏపీ కాంగ్రెస్‌ (AP Congress) అధ్యక్షురాలు షర్మిల కొడుకు పెళ్లి (Sharmila’s son’s wedding) చాలా గ్రాండ్‌గా జరిగింది. రాజస్థాన్‌ (Rajasthan) లోని జోధ్‌పూర్‌ (Jodhpur) లో ఉండే ఓ ప్యాలెస్‌లో రాజారెడ్డి ప్రియ వివాహం జరిగింది. ఈ పెళ్లికి షర్మిల (Sharmila) దంపతులు దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టినట్టు రాజకీయా వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. అంబానీ, అదానీ లాంటి సంపన్నుల పెళ్లిళ్లు జరిగే ఈ ప్యాలెస్‌ను.. తన కొడుకు పెళ్లి కోసం బుక్‌ చేశారు షర్మిల. తమ రేంజ్‌కు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు కూడా చేశారు. పెద్దమొత్తంలో ఖర్చుపెట్టి కొడుకు పెళ్లి అందరికీ గుర్తుండిపోయేలా చేశారు. స్నేహితులు, బంధుమిత్రుల మధ్య రాజారెడ్డి పెళ్లిలో కనిపించిన లవ్‌లీ సీన్స్‌ అన్నీ ఇన్నీ కాదు. కానీ అంతా పెళ్లికి వచ్చినా జగన్‌ లేని లోటు పెళ్లిలో చాలా క్లియర్‌గా కనిపించింది.

రాజారెడ్డి సొంత మేనమామ వైఎస్‌ జగన్‌ మాత్రం రాజారెడ్డి పెళ్లికి రాలేదు. అంతా అనుకున్నట్టుగానే ఆమన పెళ్లికి దూరంగా ఉన్నారు. దీనికి కారణం షర్మిల జగన్‌ మధ్య రాజకీయంగా పెరిగిన గ్యాపే కారణం అని తెలుస్తోంది. రీసెంట్‌గా జరిగిన రాజారెడ్డి ప్రియ ఎంగేజ్‌మెంట్‌ (Engagement) కు తన భార్యతో సహా వచ్చారు సీఎం జగన్‌ (CM Jagan). కొత్త జంటకు కంగ్రాట్స్‌ చెప్పి.. షర్మిల అనిల్‌తో కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు.. కనీసం పెళ్లికి అటెండ్‌ కూడా అవ్వలేదు. రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్‌ జరిగినప్పుడు షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్‌ అవ్వలేదు. అవుతారని ప్రచారం జరిగినా.. అధికారికంగా ఆ పని చేయలేదు.

ఈ కారణంగానే జగన్‌ అప్పుడు ఆ కార్యక్రమానికి వచ్చారు అనేది ఒక వాదన. కానీ ఆ ఎంగేజ్‌మెంట్‌ తరువాత షర్మిల కాంగ్రెస్‌లో జాయిన్‌ అయ్యారు. అంతేకాకుండా జగన్‌ను టార్గెట్‌ చేస్తూ ఏపీలో వరుస మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. తన తండ్రి ప్రారంభించిన రచ్చబండ కార్యక్రమాన్ని ఏపీలో మళ్లీ కంటిన్యూ చేస్తున్నారు. ప్రతీ మీటింగ్‌లో జగన్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. ఒక రకంగా.. ప్రతిపక్షంలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కూడా జగన్‌ను అన్ని మాటలు అనడంలేదు. కానీ షర్మిల మాత్రం ఛాన్స్‌ దొరికిన ప్రతీసారి జగన్‌ను ఫుట్‌బాల్‌ ఆడేస్తున్నారు. ఇంతటి పొలిటికల్‌ గ్యాప్‌ పెరిగిన కారణంగానే జగన్‌ తన మేనల్లుడి పెళ్లికి రాలేదు అని అంతా అంటున్నారు.