WHERE IS SHARMILA : షర్మిల కనబడుటలేదు ఎన్నికలవేళ మాయమైన చెల్లెమ్మ !!

అంతన్నది. ఇంత అన్నది. ఇప్పుడు సడన్ గా మాయమైపోయింది. ఏపీ ఎన్నికల హీట్ తో ఊగిపోతోంది. జగన్ అభ్యర్థులందరినీ ప్రకటించేసి జనంలోకి వచ్చేసాడు. జగన్ స్పీడ్ చూస్తే ప్రత్యర్థులకి టెన్షన్ పుడుతోంది. మరోవైపు టిడిపి, జనసేన, బిజెపి అభ్యర్థుల్ని ఖరారు చేయడంలో తుది అంకానికి చేరుకున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాబలం పేరిట సభల మీద సభలు పెట్టి చెలరేగిపోతున్నారు. ఇంత హీట్ హార్ట్ సమయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హఠాత్తుగా మాయం అయ్యారు. వారం రోజుల నుంచి చెల్లెమ్మ ఎక్కడుందో కనిపించడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 28, 2024 | 11:56 AMLast Updated on: Mar 28, 2024 | 11:56 AM

Where Is Sharmila

ఉన్నట్టుండి AP CC అధ్యక్షురాలు  షర్మిల (APCC President Sharmila) ఎక్కడికి వెళ్ళారు. బాగా దగ్గరి వాళ్ళని అడిగితే…. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారని చెబుతున్నారు. ఆ పార్టీ లీడర్లు అడిగితే ఆమె కోసం మేం కూడా వెతుకుతున్నామని  అంటున్నారు. ఏపీలో మిగతా పార్టీలు అభ్యర్థులు జాబితాలను విడుదల చేశాయి. ప్రచారం కూడా మొదలు పెట్టేసేయ్. షర్మిల మాత్రం ఊహించిన విధంగా ఎక్కడికో మాయమైపోయారు. ఆమె ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఉన్నాయా అంటే అన్ని జరిగిపోయాయి. మొన్న మధ్యాహ్నం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఒక భారీ మీటింగ్ పెట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా పిలిచి ధూమ్ దామ్ గా నిర్వహించిన తర్వాత మళ్లీ షర్మిల కనిపించలేదు. అసలు ఏపీ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియట్లేదు. టికెట్లు ఇచ్చే వాడు ఉన్నా అడిగేవాడు లేడు. అసలు ఎన్ని సీట్లు పోటీ చేస్తారు… ఎవరితో కలిపి చేస్తారు ఏదీ తెలియదు. షర్మిలని (Sharmila) వెంటేసుకొని తిరిగిన కెవిపి రామచంద్రరావు, రఘువీరారెడ్డి కూడా మధ్యలో మాయమయ్యారు.

మా అన్నని ఓడించండి… నేను ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తాను లాంటి నినాదాలతో ఒక నెల రోజులు మాత్రం షర్మిల…. ఏపీ పాలిటిక్స్ లో కళకళలాడిపోయారు. కాంగ్రెస్ పార్టీలోనే కీలక వ్యక్తుల్ని షర్మిల గురించి అడిగితే …. మేడం తన కాలు తీసి బయటకు పెట్టాలంటే పార్టీ ఫండ్ పెట్టుకోవాల్సిందే. పార్టీ డబ్బులు ఇస్తే గానీ… తన ఖర్చులన్నీ పెట్టుకుంటే గానీ… షర్మిల బయటకు రానని భీష్మించుకొని  కూర్చున్నారట. నా దగ్గర డబ్బుల్లేవు. మా అన్న దగ్గర నుంచి రావాల్సిన వాటా నాకు రాలేదు. కనుక మీరే డబ్బులు పెట్టాలి. నా ఖర్చులన్నీ పార్టీ చూసుకోవాల్సిందే అని కరాఖండీగా చెప్పేస్తున్నారట షర్మిల. గెలవని పార్టీకి సొంత డబ్బులు ఎవరు పెడతారు. తెలంగాణలో పార్టీ నడిపిన రోజులంటే రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో కొందరు జేబులోంచి తీసి ఖర్చు పెట్టారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు పెడతారు. అది అడ్రస్ లేని పార్టీ. అధికారం లేని పార్టీ కూడా. పోనీ డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్లు కొనుక్కునే వాళ్ళు కూడా ఏపీలో ఇప్పుడు ఎవరూ లేరు. కాంగ్రెస్ వెంట పడినా కూడా పోటీ చేసే అభ్యర్థులు దొరకరు. కాంగ్రెస్ పార్టీ ఆఫీషియల్ అకౌంటు బ్లాక్ అయింది. ఇంకా వాళ్లు షర్మిలాకు ఏం డబ్బులు పెట్టుబడి పెడతారు? కానీ షర్మిల మాత్రం… నాకు అవన్నీ అనవసరం. ఖర్చులు మీరు పెడితే నేను వచ్చి హంగమా చేస్తా… నా దగ్గర నుంచి రూపాయి ఆశించకండి అని తెగేసి చెప్పేశారంట. ఇంకో వెర్షన్ కూడా వినిపిస్తోంది. షర్మిల, జగన్ తాత్కాలికంగా రాజీ పడ్డారని… అన్నను డ్యామేజ్ చేయకుండా కొద్దిరోజులు షర్మిల నిశ్శబ్దంగా ఉంటారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. జగన్ బస్సు యాత్రకు (Jagan Bus tour) ముందు ఇడుపులపాయలో తండ్రి సమాధి దగ్గర జరిగిన కార్యక్రమానికి తల్లి విజయమ్మ కూడా హాజరైంది. జగన్నీ ముద్దాడుతూ… యుద్ధానికి పంపుతున్నట్టుగానే విజయం హావ భావాలు కనిపించాయి. అది చూసిన జనం… అసలు ఈ ఫ్యామిలినీ అర్థం చేసుకోలేం రా బాబూ అంటూ జుట్టు పీక్కుంటున్నారు. ఒకవైపు కూతురితో కలిసి విజయమ్మ ప్రచారంలో పాల్గొంటుంది. మరోవైపు కూతురికి ప్రత్యర్థి అయిన కొడుకు దగ్గరికెళ్లి నువ్వు గెలవాలని ఆశీర్వదిస్తుంది. మొత్తం మీద ఏపీలో పవర్ నా కుటుంబంలోనే ఉండాలని విజయమ్మ కోరుకుంటున్నట్లు ఉంది. నిన్న విజయమ్మ (Vijayamma) వచ్చి జగన్ ఆశీర్వదించడం చూస్తే… జగన్, షర్మిల తాత్కాలింగా రాజీ పడ్డారని… అందుకే షర్మిల స్పీడ్ తగ్గించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.