Auto Gift : రిక్షా డబ్బులతో ఊరంతా పార్టీ.. మరియమ్మకు పవన్ కల్యాణ్ ఆటో గిఫ్ట్

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే... మా ఆయన రిక్షా తొక్కగా వచ్చిన డబ్బులతో ఊరంతా పార్టీ ఇస్తా... ఏపీ ఎన్నికలకు ముందు ఈ డైలాగ్స్ వినని వాళ్ళు ఉండరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 10, 2024 | 01:00 PMLast Updated on: Jul 10, 2024 | 1:00 PM

Whole Town Party With Rickshaw Money Pawan Kalyan Auto Gift To Mariamma

 

 

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే… మా ఆయన రిక్షా తొక్కగా వచ్చిన డబ్బులతో ఊరంతా పార్టీ ఇస్తా… ఏపీ ఎన్నికలకు ముందు ఈ డైలాగ్స్ వినని వాళ్ళు ఉండరు. పిఠాపురంలో మరియమ్మ అనే మహిళ హుషారుగా గంతులు వేస్తూ అన్నమాటలు అప్పట్లో వైరల్ గా మారాయి. రిక్షా తొక్కుతూ రోజు వారీగా వచ్చే డబ్బులతో జీవించే మరియమ్మ కుటుంబానికి పవన్ కల్యాణ్ పై ఉన్నఅభిమానం చూసి జనసైనికులు, ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడా మరియమ్మకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆటో గిఫ్ట్ గా పంపించాడు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం ఎన్నికల్లో విజయం సాధించాలని చాలామంది కోరుకున్నారు. సామాన్య జనం నుంచి సెలబ్రిటీలు దాకా ఎన్నో దేవుళ్ళకి మొక్కకున్నారు. 70వేల ఓట్ల మెజారిటీతో పవన్ కల్యాణ్ గెలిచాడు. ఈ ఎన్నికలకు ముందు మరియమ్మ అనే మహిళ పవన్ గెలవాలంటూ చేసిన కామెంట్స్ అందర్నీ కట్టిపడేశాయి. పిఠాపురం నియోజకవర్గంలో ఓ రిక్షా కార్మికుడి భార్య మరియమ్మ. పనవ్ గెలిస్తే… మా ఆయన రిక్ష తొక్కగా వచ్చిన డబ్బులతో ఊరంతా పార్టీ ఇస్తా అంటూ సంతోషంగా చెప్పింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భర్త కూడా ఆమె ఏదంటే అదే… పార్టీ ఇస్తామని చెప్పాడు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ కూడా ఈ కామెంట్స్ పై స్పందించారు. ప్రజలు నన్ను బలంగా కోరుకుంటున్నారని అన్నారు.

పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత… తన భర్త ఒక రోజు రిక్షా తొక్కగా వచ్చిన డబ్బులతో మరియమ్మ స్వీట్లు కొని చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టింది. తర్వాత ఈ విషయం పవన్ కల్యాణ్ కు తెలిసింది. దాంతో ఆయన చలించిపోయారు… ఆ కుటుంబానికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని జనసేన నాయకులను ఆదేశించారు. దాంతో జనసైనికులు ఆ కుటుంబానికి ఆటో కొని గిఫ్ట్ గా ఇచ్చారు. ఆటో తీసుకున్న మరియమ్మ దంపతులు కన్నీళ్ళ పర్యంతం అయ్యారు. 20యేళ్ళుగా తన భర్త రిక్షా తొక్కుతున్నాడని చెప్పిందామె. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఇచ్చిన ఆటోతో తమ జీవితాలు మారిపోతాయని అంటోంది. మరియమ్మకు పవన్ కల్యాణ్ గిఫ్ట్ ఇవ్వడంపై జనసైనికులు, ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.