YS Vijayamma : విజయమ్మ ఎందుకు అంతలా ఏడ్చారు ? జగన్, షర్మిల తీరే కారణమా..
చూశారుగా.. విజయమ్మ ఇలా ఏడవడం, ఇంతలా ఏడవడం.. ఈ మధ్య ఎవరూ చూడలేదు. వైఎస్ చనిపోయినప్పుడు మాత్రమే ఆమె ఇంతలా కన్నీళ్లు పెట్టుకున్నారు.
చూశారుగా.. విజయమ్మ ఇలా ఏడవడం, ఇంతలా ఏడవడం.. ఈ మధ్య ఎవరూ చూడలేదు. వైఎస్ చనిపోయినప్పుడు మాత్రమే ఆమె ఇంతలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రతీ ఏడాది వైఎస్ జయంతి రోజు.. ఇడుపులపాయకు వచ్చినా ఎప్పుడూ ఇంత ఎమోషనల్ అవలేదు. విజయమ్మను ఓదార్చడం అక్కడ ఉన్నవాళ్లకు కూడా సాధ్యం కాలేదు అంటే.. ఎంత ఏడ్చి ఉంటుందో ఊహించుకోవచ్చు. విజయమ్మ ఎందుకింత ఆవేదన పడ్డారు.. ఎవరికి వారు అని విడిపోయి కత్తులు నూరుకుంటున్న షర్మిల, జగన్ తీరే కారణమా.. ఎందుకీ కన్నీళ్లు అంటూ సోషల్ మీడియా చర్చ మొదలైంది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఇడుపులపాయలో ఘనంగా జరిగాయ్.
ఇడుపులపాయకు జగన్, షర్మిల వేర్వేరుగా వచ్చారు. తల్లితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనలు చేసిన విజయమ్మను జగన్ అక్కున చేర్చుకున్న సమయంలో.. అక్కడ ఉద్విగ్న పరిస్థితులు కనిపించాయ్. భరించలేని దుఖంతో విజయమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లి నుంచి ఆశీర్వచనం తీసుకున్న జగన్… అందరికీ వీడ్కోలు పలుకుతూ వెళ్లిపోయారు. రవీంద్రనాథరెడ్డి సముదాయించే ప్రయత్నం చేసినా.. విజయమ్మ కన్నీళ్లు ఆగలేదు. తమ్ముడు రవీంద్రనాథరెడ్డిని హత్తుకుని విజయమ్మ రోదించారు. ఊహించని ఈ పరిణామంతో.. వైఎస్ ఫ్యామిలీ కళ్లల్లో నీళ్లు తిరిగాయ్. విజయమ్మ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు.. అక్కడికి వచ్చిన ప్రతీ ఒక్కరిని కలిచి వేసింది. ఐతే విజయమ్మ ఎందుకు ఇంతలా ఏడ్చారనే చర్చ.. ఇప్పుడు ప్రతీ ఒక్కరిని వెంటాడుతోంది.
ఐతే దీనికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయ్. ఒకప్పుడు నవ్వుతూ హాయిగా ఉన్న వైఎస్ కుటుంబం… ఇప్పుడు ముక్కలైంది. వివేకా హత్య తర్వాత.. వైఎస్ కుటుంబంలో చిన్నపాటి తుఫాన్ మొదలైంది. కొందరి మీద కేసులు.. వాళ్ల మీద మరికొందరి ఆరోపణలు.. ఇంకొందరి తిరుగుబాట్లు.. వైఎస్ కుటుంబంలో ప్రశాంతత లేకుండా పోయింది అన్నది క్లియర్. పైగా జగన్, షర్మిల.. బద్దశత్రువులుగా మారిపోయారు. అన్న అంతం చూడడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటే.. షర్మిల ఏ స్థాయిలో కోపం పెంచుకుందో అర్థం అవుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య పెద్దాయనే ఉండుంటే అన్న ఆలోచనే.. విజయమ్మను అలా కన్నీరు పెట్టించింది అనే చర్చ జరుగుతోంది.
పైగా ఇప్పుడు విజయమ్మ ముందు మరో పెద్ద ప్రశ్న ఉంది. రాజకీయ పరిస్థితుల మధ్య.. కొడుకుతో ఉండాలా.. కూతురుతో ఉండాలా అనేది తేల్చుకోలేని స్థితిలో విజయమ్మ ఉంది. ఈ పరిణామం కూడా విజయమ్మను కన్నీళ్లు పెట్టించేలా చేసిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఒకరి మొహం ఒకరు చూసుకోవడం ఇష్టం లేదు అన్నట్లుగా.. ఇడుపులపాయకు జగన్, షర్మిల విడివిడిగా వచ్చారు. ఈ పరిణామం ఆ తల్లి హృదయానికి మరింత గాయం చేసి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. కారణం ఏదైనా.. విజయమ్మను అలా చూసి.. ఓ ఒక్క మనసు కూడా తట్టుకోలేకపోయంది. విజయమ్మతో పాటు కన్నీరు కార్చింది.