Panav Kalyan : హోం శాఖ ఎందుకు తీసుకోలేదంటే.. పవన్ భారీ ప్లానే వేశాడుగా…
ఏపీలో పూర్తిస్థాయిలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 12న సీఎంగా చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఐతే ఎవరికి ఏ శాఖ అన్న దానిపై కొనసాగిన సస్పెన్స్ అంతా ఇంతా కాదు. మిగతా మంత్రుల సంగతి ఎలా ఉన్నా.. పవన్ కల్యాణ్ ఏం తీసుకుంటారు.
ఏపీలో పూర్తిస్థాయిలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 12న సీఎంగా చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఐతే ఎవరికి ఏ శాఖ అన్న దానిపై కొనసాగిన సస్పెన్స్ అంతా ఇంతా కాదు. మిగతా మంత్రుల సంగతి ఎలా ఉన్నా.. పవన్ కల్యాణ్ ఏం తీసుకుంటారు.. ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనే చర్చ.. మూడు రోజులుగా ఏపీ రాజకీయాలను షేక్ చేసింది. ఐతే సస్పెన్స్‌కు బ్రేక్ చెప్తూ.. మంత్రులకు శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు. పొత్తుల్లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి డిప్యూటీ సీఎంతో పాటు.. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. మంత్రుల ఇష్టాలు, సామర్థ్యం మేరకు శాఖలు కేటాయిస్తామని చంద్రబాబు గతంలోనే అన్నారు.
ఐతే పవన్ కల్యాణ్ విషయంలో మాత్రం చాయిస్ ఆయనకే వదిలేశారు. ఏ ప్రభుత్వం అయినా.. సీఎం తర్వాత స్థానం హోం శాఖది. ఐతే పవన్ మాత్రం హోం శాఖ తీసుకోలేదు.
దీంతో ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. హోం శాఖ కాకుండా.. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల విషయంలో పవన్ కల్యాణ్ కాంప్రమైజ్ అయ్యారా.. చంద్రబాబు ఆయనను ఒప్పించారా అనే చర్చ కూడా మొదలైంది. ఐతే పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను ఎంపిక చేసుకోవడం వెనక.. పవన్ కల్యాణ్ స్ట్రాటజీ కనిపిస్తోంది. హోం శాఖ తీసుకుంటే.. రకరకాల వివాదాల్లో తల దూర్చాల్సి ఉంటంది. పైగా సీఎం చంద్రబాబుతో పాటు లోకేశ్ చెప్పినట్లు వినాల్సి ఉంటుంది. ఒకరకంగా ఐడెంటిటీ మిస్ అవుతుంది. ఇక ప్రతీ రోజు ఇంటెలిజెన్స్ నివేదికుల ఫాలో కావాల్సి ఉంటుంది. అన్ని సంక్షోభాలని హోంమంత్రి అడ్రస్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా.. దానికి హోంమంత్రి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అటు పొలిటికల్ కెరీర్, ఇటు సినిమాలు చూస్తే.. ప్రస్తుతం పవన్ దగ్గర అంత టైమ్ ఉండే చాన్స్ లేదు. పైగా ఎవరో చెప్పిన ఆర్డర్లను ఫాలో కావడమో.. లేదంటే అంశాల మీద అడ్రస్ చేయడమో తప్పితే.. కొత్తగా ఏదైనా చేయడానికి, పాలనలో కొత్తదనం చూపించడానికి.. హోంశాఖలో అవకాశం ఉండదు. ప్రొడక్టివిటీ ఉండే చాన్స్ లేదు. లా అండ్ ఆర్డర్ ఎలాగూ ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది.
దీంతో హోంమంత్రిగా ఉండి సాధించేది పెద్దగా ఏమీ ఉండే చాన్స్ లేదు. పైగా హోం మినిస్టర్ అంటే.. అది ఆఫీస్‌లో ఉండి చూసుకోవాల్సిన బాధ్యత. జనాలతో పెద్దగా డైరెక్ట్ కనెక్టివిటీ ఉండే అవకాశం ఉండదు. అందుకే పవన్ హోం శాఖకు నో చెప్పినట్లు తెలుస్తోంది. అదే పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా.. జనాలకు దగ్గరగా ఉండే చాన్స్ ఉంటుంది. జనసేనాని మాటకు జస్టిఫికేషన్ ఇచ్చే చాన్స్ ఉంటుంది. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మాత్రమే కాదు.. తాగునీటి సరఫరా, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ద్వారా రాష్ట్రంలో చాలామంది జనాలకు దగ్గర అవొచ్చు. జనాల్లో ఉంటే.. జనంతో ఉంటే.. రాజకీయంగా చాలా నేర్చుకునే వెసులుబాటు ఉంటుంది.
ఇక పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ బాధ్యత తీసుకోవచ్చు. జనాల్లో ఎక్కువ కలిసి ఉంటే.. అసలు గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. పైగా జనసేన బలం పుంజుకోవడానికి ఇదే సరైన సమయం. రాష్ట్రంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని విస్తరించాల్సిన అవసరం ఉంది. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా… జనాలతో ఉంటూ.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరించడమే కాదు.. నెట్‌వర్క్ పెంచుకునే చాన్స్ ఉంటుంది. పంచాయితీరాజ్ మంత్రి హోదాలో రాష్ట్రమంతా విస్తృత పర్యటన చేయొచ్చు. ఎలాంటి వివాదలు ఉండవు. పైగా గ్రామీణాభివృద్ధిలో ఫిజికల్ డెవలప్‌మెంట్ కనిపిస్తుంది. ఇలా అన్ని రకాలుగా ఆలోచించి.. రాబోయే పదేళ్లను ముందు చూసి.. పవన్ కల్యాణ్ ఈ శాఖలు ఎంచుకున్నాడని క్లియర్‌గా అర్థం అవుతోంది.