AP-TG Politics : జైలుకు వెళ్తే సీఎం అయిపోతారా.. కేసీఆర్‌ను అరెస్ట్ చేయనిది అందుకేనా?
రాజకీయాల్లో సెంటిమెంట్‌లు కామన్.. ఐతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ (Politics) లో కొత్త సెంటిమెంట్ స్టార్ట్ అయింది. అదే.. జైలుకెళ్తే సీఎం అవుతారని ! తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయ్.
రాజకీయాల్లో సెంటిమెంట్‌లు కామన్.. ఐతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ (Politics) లో కొత్త సెంటిమెంట్ స్టార్ట్ అయింది. అదే.. జైలుకెళ్తే సీఎం అవుతారని ! తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయ్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఇద్దరు కూడా జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లే కావడంతో.. ఈ సెంటిమెంట్ మరింత బలంగా మారింది. ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు.. ఐదేళ్ల తర్వాత సచివాలయంలో అడుగు పెట్టారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లే.. మెగా డీఎస్సీ (Mega DSC) మీద మొదటి సంతకం పెట్టారు. సరిగ్గా ఎన్నికల ముందు.. స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకు (Jail) వెళ్లారు. టీడీపీ (TDP) అఖండ విజయం వెనక.. ఆ జైలు ఎపిసోడ్ ప్లస్ అయింది. చంద్రబాబు (Chandrababu) జైలుకు వెళ్లిన తర్వాత.. పొత్తులకు రెడీ అంటూ పవన్ ముందుకు రావడం.. బీజేపీని కూటమిలోకి తీసుకురావడంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్త పడ్డారు.
ఇదంతా ఎలా ఉన్నా.. ఈ వయసులో చంద్రబాబును జైలుకు పంపించారు అనే సింపథీ జనాలను కదిలించింది. టీడీపీ (TDP) కి అద్భుత విజయం దక్కేలా చేసింది. అలా జైలుకు వెళ్లి వచ్చి.. ఇలా ప్రచారం చేసి.. మళ్లీ అలా సీఎం అయిపోయారు చంద్రబాబు. ఈయనే కాదు.. ఏపీ మాజీ సీఎం జగన్ కూడా అంతే ! అక్రమార్జన, మనీ లాండరింగ్, క్విడ్ ప్రోకో ఆరోపణలపై అరెస్ట్ అయిన జగన్.. 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాక ప్రతీ శుక్రవారం సీబీఐ (CBI) కోర్టుకి హాజరయ్యేవాడు. 2014 ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా 60 పైగా సీట్లతో నిలబడగలిగారు. ఆ తర్వాత పాదయాత్ర చేయడం వల్ల 2019 ఎన్నికల్లో 151 సీట్ల బంపర్ మెజారిటీతో వైసీపీ (YCP) గెలిచింది. జగన్ సీఎం అయ్యారు. అదే స్టోరీ తెలంగాణలోనూ రిపీట్ అయింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకెళ్లారు. ఆ తర్వాత 2018లో కేటీఆర్ ఫామ్‌హౌస్‌ని డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారనే ఆరోపణలపై మరోసారి అరెస్ట్ అయ్యారు. ఆ అరెస్ట్ ద్వారా రేవంత్‌కు వచ్చిన సింపధీ అంతా ఇంతా కాదు. కట్ చేస్తే.. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం.. రేవంత్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయింది. చంద్రబాబు, రేవంత్.. ఈ ముగ్గురు కూడా అరెస్ట్ అయి తిరిగి వచ్చి ముఖ్యమంత్రులు అయ్యారు.
ఈ ముగ్గురి ఎపిసోడ్‌లు చూసి.. జైలుకు వెళ్లి వస్తే సీఎం అయిపోవడం ఖాయం అని జనాలు ఫిక్స్ అయిపోయారు. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి పీఠం దగ్గరవుతుందని అనుకునేవాళ్లు ఒకప్పుడు.. ఇప్పుడు మాత్రం సీన్ మారింది. జైలు డోర్ కొట్టు.. సీఎం సీటు పట్టు అన్నట్లుగా సెంటిమెంట్ మారిపోయిందని జనాలు మాట్లాడుకుంటున్నారు. జైలు సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాల్లో బలంగా వినిపిస్తోంది కూడా అందుకే ! ఈ సెంటిమెంట్‌ను ఆధారంగా చేసుకొని.. మరో కొత్త వాదన తెరమీదకు వస్తోంది. కేసీఆర్, కేటీఆర్‌ను జైలుకు పంపిస్తామని పదేపదే అంటున్న కాంగ్రెస్ సర్కార్.. ఆ చర్యకు దిగకపోవడానికి ప్రధాన కారణం.. ఈ సెంటిమెంటే అనే చర్చ జరుగుతోంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని.. గొర్రెల స్కామ్ అని మరోసారి.. కేసీఆర్ ఫోన్‌ట్యాపింగ్ చేశారంటూ ఇంకోసారి.. పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. ఈ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని మాత్రం అనుకోవడం లేదు. మళ్లీ వాళ్లను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే.. సెంటిమెంట్ వర్కౌట్ అయి.. సింపథీ వచ్చేసి.. బీఆర్ఎస్ ఫామ్‌లోకి వచ్చి.. ఎక్కడ సీఎం అయిపోతారనే భయం కూడా కాంగ్రెస్‌లో ఉండి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.