RRR : రఘురామకు ఉండి ఫిక్స్‌.. RRRకు రామరాజు సపోర్ట్ చేస్తారా ?

నామినేషన్ల వేళ.. ఐదుగురు అభ్యర్థులను మారుస్తూ టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నిర్ణయం తీసుకున్నారు. ఉండి టికెట్ వ్యవహారం మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక్కడి నుంచి రఘురామ పోటీ చేసేందుకు లైన్ క్లియర్‌ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2024 | 12:15 PMLast Updated on: Apr 21, 2024 | 12:15 PM

Will Raghurama Be Fixed Will Ramaraju Support Rrr

నామినేషన్ల వేళ.. ఐదుగురు అభ్యర్థులను మారుస్తూ టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నిర్ణయం తీసుకున్నారు. ఉండి టికెట్ వ్యవహారం మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక్కడి నుంచి రఘురామ పోటీ చేసేందుకు లైన్ క్లియర్‌ చేశారు. ఇప్పటికే ఉండి టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజుకు ఇవ్వగా.. ఆయనను తప్పించి ఇప్పుడు ఆ స్థానంలో రఘురామను బరిలో దింపుతోంది టీడీపీ. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. నిజానికి ఉండి టికెట్ కోసం ముగ్గురు రాజుల మధ్య చిన్నపాటి యుద్ధమే కనిపించింది. శివరామరాజు (Sivaramaraj), రామరాజు, రఘురామరాజు(Raghuramaraj).. ఈ త్రయంలో ఫైనల్‌గా ట్రిపులార్ సక్సెస్ అయ్యారు.

శివరామరాజు ఇండిపెండెంట్‌గా బరిలో ఉండేందుకు రెడీ కాగా.. రామరాజు పరిస్థితి ఏంటి.. రఘురామకు సపోర్ట్ చేస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ముందు తన పేరు ప్రకటించి.. ఆ తర్వాత తప్పించి.. ఆ టికెట్‌ను రఘురామకు ఇవ్వడంపై.. రామరాజు ముందు నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత కూడా ఆయన కూల్ అయినట్లు కనిపించలేదు. ఒకరకంగా తనను బలి చేశారని ఫైర్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రఘురామకు రామరాజు సహకరిస్తారా.. లేదంటే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారా అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

ఓ వైపు శివరామరాజు స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు రామరాజు కూడా ఇండిపెండెంట్‌గా పోటీచేస్తే.. రఘురామకు ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతోంది. మరి ఇప్పుడు టీడీపీ రామరాజును ఎలా కూల్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు (Chandrababu) హామీలకు రామరాజు ఒప్పుకుంటారా.. లేదంటే రెబెల్‌గా మారతారా అన్నది టెన్షన్ పుట్టిస్తోంది.