TDP, Raghurama, RRR : ఉండిలో రఘురామ గెలిచేనా.. భారీ సంచలనాలు చూస్తామా.. పోలింగ్‌ శాతం చెప్తుందేంటి?

పిఠాపురం (Pithapuram) తర్వాత.. ఏపీ అసెంబ్లీ ఎన్నిక (AP Assembly Elections) ల్లో అందరి అటెన్షన్ డ్రా చేసిన నియోజకవర్గం.. ఉండి ! ట్విస్టుల మీద ట్విస్టుల తర్వాత.. రఘురామకు ఇక్కడ టికెట్ ఇచ్చింది టీడీపీ. ఆయనకోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కూడా పక్కన పెట్టింది. ఐతే రామరాజు కూల్‌ అయినా.. శివరామరాజు రెబెల్‌గా బరిలో దిగారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 14, 2024 | 01:38 PMLast Updated on: May 14, 2024 | 1:38 PM

Will Raghurama Win Will We See Huge Sensationalism What Will The Polling Percentage Say

పిఠాపురం (Pithapuram) తర్వాత.. ఏపీ అసెంబ్లీ ఎన్నిక (AP Assembly Elections) ల్లో అందరి అటెన్షన్ డ్రా చేసిన నియోజకవర్గం.. ఉండి ! ట్విస్టుల మీద ట్విస్టుల తర్వాత.. రఘురామకు ఇక్కడ టికెట్ ఇచ్చింది టీడీపీ. ఆయనకోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కూడా పక్కన పెట్టింది. ఐతే రామరాజు కూల్‌ అయినా.. శివరామరాజు రెబెల్‌గా బరిలో దిగారు. దీంతో ఉండి ఫలితం ఎలా ఉండబోతుంది.. రఘురామ (Raghurama) విజయం సాధిస్తారా లేదా అని జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. జగన్‌ను పర్సనల్‌గా తీసుకున్న రఘురామ.. నాలుగేళ్ల మాట ఓ ఆట ఆడుకున్నారు. దీంతో ట్రిపులార్‌కు చెక్ పెట్టేందుకు వైసీపీ ప్రత్యేక చర్యలు తీసుకుంది.

ఇలాంటి పరిస్థితుల మధ్య.. ఉండి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో కంపేర్ చేస్తే పోలింగ్ పర్సంటేజీ 3శాతం తగ్గింది. 2019 ఎన్నికల్లో ఉండిలో 85 శాతానికి పైగా పోలింగ్ జరగగా.. ఈసారి 82 దగ్గరే ఆగిపోయింది. దీంతో ఓటర్ తీర్పు ఎలా ఉంటుంది. ఉండిలో రఘురామ భవిష్యత్‌ను డిసైడ్ చేయబోయేది ఎవరు.. ఫలితం ఎలా ఉండబోతుందనే టెన్షన్.. ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, వృద్ధులు ఈసారి కీలకంగా మారబోతున్నారు. ఉండి నియోజకవర్గంలోనూ మహిళలు, వృద్ధులు.. జోరుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాళ్ల ఓటు ఎటు వైపు అన్న దాని మీదే.. ఉండిలో విజయం ఎవరిది అనేది తేలే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

దీనికితోడు టీడీపీ(TDP) ని వ్యతిరేకించి రెబెల్‌గా పోటీ చేసిన శివరామరాజు.. సైకిల్ పార్టీ ఓట్లను లాగేసుకునే అవకాశం ఉంటుంది. నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో శివరామరాజుకు మంచి పట్టు ఉంది. ఐతే ఆయనకు సిపంధీ వర్కౌట్ అయితే.. టీడీపీ ఓట్లకు గండి పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిణామాల మధ్య.. రఘురామ పరిస్థితి ఏంటా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఏమైనా.. ఈసారి ఉండిలో సంచలన ఫలితాలు చూడడం ఖాయం అన్నది మరికొందరి వాదన. ఐతే పోలింగ్ తీరుపై.. జనాల అభిప్రాయంపై ఎప్పటికప్పుడు ఆరా తీసిన రఘురామ.. గెలుపు మీద ధీమాగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. మరి ఫైనల్ రిజల్ట్ ఏంటి అన్నది తెలియాలంటే మాత్రం.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..