NEGGEDEVARU – SRIKAKULAM : రామ్మోహన్ హ్యాట్రిక్ కొడతారా ? కుల సమీకరణాలతో వైసీపీ బోణీ చేస్తుందా ?

రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం లోక్‌సభ (Lok Sabha Elections) స్థానంపై అందరి కళ్లు పడ్డాయి. సిట్టింగ్ ఎంపీ హ్యాట్రిక్‌ సాధిస్తారా ? లేదంటే టిడిపి జైత్రయాత్రకు వైసిపి కళ్ళెం వేస్తుందా.?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 27, 2024 | 11:05 AMLast Updated on: May 27, 2024 | 11:05 AM

Will Rammohan Score A Hat Trick Is Ycp Doing Boni With Caste Equations

 

 

రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం లోక్‌సభ (Lok Sabha Elections) స్థానంపై అందరి కళ్లు పడ్డాయి. సిట్టింగ్ ఎంపీ హ్యాట్రిక్‌ సాధిస్తారా ? లేదంటే టిడిపి జైత్రయాత్రకు వైసిపి కళ్ళెం వేస్తుందా.? ఓడెదెవరు? గెలుపు దరి చేరేదెవరు ? సిక్కోలు పార్లమెంట్‌ (Parliament Elections) సీటులో గెలుపెవరిది ..? అధికార పార్టీ అభ్యర్థికి క్రాస్‌ ఓటింగ్ భయం పట్టుకుందా ? శ్రీకాకుళంలో నెగ్గేదెవరు ?

శ్రీకాకుళం (Srikakulam) పార్లమెంట్‌లో గెలుపెవరిదన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ తరపున సిట్టింగ్‌ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, అధికార పార్టీ తరపున పేరాడ తిలక్‌ బరిలోకి దిగారు. వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్‌నాయుడు(Rammehan Naidu). మూడోసారి కచ్చితంగా విజయం సాధిస్తానన్న ధీమాలో ఉన్నారు. మరోవైపు టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి… జెండా పాతాలని లక్ష్యంతో క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌ను అమలు చేసింది వైసీపీ. దీంతో 2024 ఎన్నికల్లో సిక్కోలు ఎంపీగా ఎవరు గెలుస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం పార్లమెంట్‌లో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం ఉన్నాయి. సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతమున్న ఈ నియోజకవర్గంలో మత్స్యకారుల ప్రభావం ఎక్కువ. నియోజవర్గంలో 10 లక్షల 23 వేల 974 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కాళింగ, వెలమ, తూర్పు కాపు వంటి బిసి కులాలు ఇక్కడ కీలకం.

శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ భారీగా నమోదైంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో 74.99 శాతం ఓటింగ్ నమెదైంది. 2014లో 74.36 శాతం, 2019 ఎన్నికల్లో 74.48 శాతం పోలింగ్‌ నమోదైంది. గతేడాది కంటే పోలింగ్‌ పెరగడంతో…అధికార, విపక్ష నేతలు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపుతో హ్యాట్రిక్‌ కొడతాననే ధీమాలో ఉన్నారు రామ్మోహన్‌ నాయుడు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీ కంటే రామ్మెహన్‌కు ఎక్కువ ఓట్లు పోల్ అయ్యాయి. 2019లో మరింతగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఏడు స్థానాల్లో ఐదు చోట్ల వైసీపీప గెలిచినా… పార్లమెంట్ సీటులో ఆరు వేల ఓట్లతో రామ్మెహన్ విజయం సాధించారు. ఈ క్రాస్ ఓటింగ్ భయం…వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ను వేధిస్తున్నట్లు తెలుస్తోంది.

2014లో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన రెడ్డి శాంతి, 2019లో కాళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్…రామ్మోహన్‌ చేతిలో ఓడిపోయారు. ప్రత్యర్ది ఎవరైనా కింజరాపు ఫ్యామిలీకి అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ జరుగుతోంది. 2014లో 1 లక్షా 27 వేల ఓట్ల మెజార్టీతో గెలుపోందిన రామ్మెహన్‌…2019లో 6,653 ఓట్లతో గట్టెక్కగలిగారు. ఈసారి సిక్కోలు ఎన్నికల లెక్కలు మారతాయంటున్నారు వైసిసి నేతలు. ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ బరిలోకి దిగడంతో సామాజిక అస్ర్తం పని చేస్తుందని లెక్కలు వేస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం పార్లమెంట్‌లో గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీ కంటే టీడీపీకి ఓట్లు ఎక్కువ రావడం…2019లో మరింత క్రాస్ ఓటింగ్ జరగడంతో వైసీపీ సీరియస్‌గా తీసుకుంది.

క్రాస్‌ ఓటింగ్‌ జరగకుండా వైసీపీ హైకమాండ్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని…ఈసారి తమ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ప్రతిసారి వెలమ వర్గం ఓట్లు రామ్మోహన్‌కు పడుతున్నాయని….ఈసారి అంత సీన్‌ లేదంటోంది వైసీపీ. గతంలో మెజార్టీలు వచ్చిన శ్రీకాకుళం, పాతపట్నం నియెజకవర్గాల్లో…టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలతో ఓడిపోతుందని నమ్మకంతో ఉన్నారు పేరాడ తిలక్. ఎమ్మెల్యేల గెలుపోటముల కంటే ఎంపీ అభ్యర్దుల కులసమీకరణలే క్రాస్ ఓటింగ్‌కు దారితీసాయని అంటున్నారు. ఇలా ఎవరి లెక్కలు వారు పక్కాగా వేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వెలమ వర్సెస్ కాళింగుల మధ్య జరిగిన సమరంలో…కింజరాపు కుటుంబం పైచేయి సాధిస్తూ వస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల ముందు…పార్టీలకతీతంగా సామాజికవర్గాన్ని చూసుకొని రామ్మోహన్‌కు ఓటు వేయాలని స్థానిక ప్రజాప్రతినిధి పిలుపు ఇవ్వడం సంచలనం రేపింది. వెంటనే తేరుకున్న రామ్మోహన్‌… మైక్ లాక్కోవడంతో వివాదం ముగిసింది.

ఇదంతా సోషల్ మీడియా పుణ్యాన జనంలోకి వెళ్లడంతో…వైసిపి అభ్యర్థి పేరాడ తిలక్‌కు కలిసొచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆందోళనలో ఉన్నారు. టెక్కలి, పలాస, ఇచ్చాపురం, ఆమదాలవలసలో తనకు మంచి ఓట్లు వస్తాయని, తన సామాజిక వర్గం అండగా ఉందని తిలక్ చెప్పుకుంటున్నారు. 2009 ఎన్నికల్లో మాదిరి కాళింగుల ఓట్ బ్యాంక్ పార్టీలకతీతంగా తిలక్ వైపు తిరిగిందని వైసిపి నేతలు అంచనా వేస్తున్నారు. పేరాడ తిలక్… కాళింగ కార్పోరేషన్ ఛైర్మన్‌గా పని చేయడం, జిల్లాలో విస్త్రత పరిచయాలు, బలమైన సామాజిక వర్గం అండతో ఎన్నికల్లో గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. 2019 వైసిపి హావాలోనూ గెలిచామనీ… ఇప్పుడు ప్రజా వ్యతిరేకత కూడా కలసి వస్తుందని టీడీపీ భావిస్తోంది. రామ్మెహన్ ఘనవిజయంతో హ్యాట్రిక్ కొడతారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. రామ్మోహన్‌ నాయుడుకు మెజార్టీ పెరుగుతుందని టీడీపీ లెక్కలు వేసుకుంటుంటే…పేరాడ పార్లమెంట్‌కు వెళ్లడం ఖాయమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు