బ్రేకింగ్: వైసీపీకి రోజా గుడ్ బై, ఇదే ప్రూఫ్

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 27, 2024 | 04:36 PMLast Updated on: Aug 27, 2024 | 4:36 PM

Will Rk Roja Quits Ysrcp

ఆర్కే రోజా” ఈ పేరు కొన్ని విషయాల్లో బ్రాండ్… రాజకీయ పార్టీల అధినేతలకు విధేయులుగా ఉండటం చూస్తూనే ఉంటాం. కాని ఈమెను గత పదేళ్లుగా చూసిన వాళ్ళు మాత్రం భక్తురాలు అంటారు. సోషల్ మీడియాలో ఈమె మాటలకు ఉండే క్రేజ్ వేరే లెవెల్. ఎవరిని అయినా ఎలా అయినా విమర్శించడంలో ఆమెకు ఈమెనే సాటి. ఇక జగన్ ను పొగడటంలో అయితే మేడం గారి తర్వాతే ఎవరైనా. సందర్భం ఏదైనా సరే తిట్టడం లేదా పొగడటంలో ఈమెను మించిన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో లేరనే చెప్పాలి.

ఇక గత ప్రభుత్వంలో మేడం గారు మంత్రి కూడా అయ్యారు. వైసీపీలో తన సేవలకు, పని తీరుకు గాను మంత్రి పదవి ఇచ్చారు వైఎస్ జగన్. ఆ శాఖ అంత గొప్పది కాకపోయినా మంత్రి హోదాలో ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. అలాంటి ఆర్కే రోజా ఇప్పుడు కనపడటం లేదు. ఎంతో ధైర్యంగా విమర్శలు చేసే రోజా… రెండు నెలల నుంచి ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. మొన్నా మధ్య కూతురు వద్దకు వెళ్ళినప్పుడు ఒక ఫోటో బయటకు వచ్చింది. రోడ్ పై కాస్త వింత డ్రెస్ తో స్టైల్ గా కనపడే ప్రయత్నం చేసారు రోజా.

అంతే… ఆ తర్వాత ఫోటోలకు కూడా దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు ఆమె. ఈ మధ్య కాలంలో తమిళ స్టార్ హీరో విజయ్ పెట్టబోయే రాజకీయ పార్టీలో ఆమె చేరతారు అనే వార్తలు వచ్చాయి. అవి ఎంత వరకు నిజమో గాని… తన సోషల్ మీడియా ఖాతాల్లో వైసీపీ సభ్యురాలిని అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా మొత్తం తీసేశారు. ఆమె బయోలో తన పార్టీ పేరుని తొలగించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎక్స్, ఫేస్బుక్ సహా ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో తీసేశారు. కేవలం తన ఫోటో మాత్రమే ఉంచుకున్నారు.

అలాగే బయోలో… నగిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి లాంటివే ఉంచుకున్నారు మినహా పార్టీ పేరు లేదు. దీనితో రోజా వైసీపీకి గుడ్ బై చెప్పెసినట్టే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి జగనన్న కష్టాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా వదిలేసి పోతారో రోజా గారు. చాలా మంది వైసీపీ నేతల మాదిరిగానే రోజా కూడా సైలెంట్ కావడం ఆ పార్టీ నేతలకు నచ్చడం లేదు. వైసీపీలో చెలరేగిపోయే ఫైర్ బ్రాండ్ లు అందరూ సైలెంట్ అయిపోయారు. ఒక్క అంబటి రాంబాబు మాత్రమే కాస్తో కూస్తో మీడియాలో కనపడుతున్నారు. రోజా లాంటి వాగ్దాటి ఉన్న నాయకురాలు కూడా ఇలా చేయడం ఏ మాత్రం బాలేదు అంటున్నారు వైసీపీ కార్యకర్తలు.