country petrol prices : పెట్రోల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ..
పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గబోతున్నాయనే వార్తపై.. కొద్దిరోజులుగా తెగ ప్రచారం జరుగుతోంది. పెట్రోల్ బంక్‌లు కూడా ఎక్కువ నిల్వలు పెట్టుకోవడం లేదని.. ఏ క్షణం అయినా రేట్ల తగ్గింపుపై ప్రకటన వెలువడుతుందనే రూమర్లు క్రియేట్ చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. అసలే ఇది ఎన్నికల సమయం కావడంతో.. ఈ ప్రచారం మరింత బలంగా వినిపించింది. ఎన్నికలు వస్తున్నాయంటే ఏ పార్టీ మేనిఫెస్టోలో అయినా సరే.. గ్యాస్ రేట్లు తగ్గిస్తామనే హామీ కామన్‌గా కనిపిస్తుంది.
పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గబోతున్నాయనే వార్తపై.. కొద్దిరోజులుగా తెగ ప్రచారం జరుగుతోంది. పెట్రోల్ బంక్‌లు కూడా ఎక్కువ నిల్వలు పెట్టుకోవడం లేదని.. ఏ క్షణం అయినా రేట్ల తగ్గింపుపై ప్రకటన వెలువడుతుందనే రూమర్లు క్రియేట్ చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. అసలే ఇది ఎన్నికల సమయం కావడంతో.. ఈ ప్రచారం మరింత బలంగా వినిపించింది. ఎన్నికలు వస్తున్నాయంటే ఏ పార్టీ మేనిఫెస్టోలో అయినా సరే.. గ్యాస్ రేట్లు తగ్గిస్తామనే హామీ కామన్‌గా కనిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు తగ్గించి మిడిల్ క్లాస్ ఓటర్లను అట్రాక్ట్ చేయడం ఖాయం అనే వాదన వినిపించింది. ఐతే వీటన్నింటిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రేట్ల తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఊహాజనితం అని కొట్టిపారేసింది. చమురు ధరల తగ్గింపుపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఎలాంటి చర్చలు జరగలేదని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి క్లారిటీ ఇచ్చారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా.. భారత్‌లో ఎందుకు తగ్గించడంలేదనే విషయంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.
వాల్డ్ మార్కెట్‌లో ఇప్పటికిప్పుడు చమురు ధరలు తగ్గినా.. తీవ్రమైన అప్ అండ్ డౌన్స్ ఎవరూ అంచనా వేయలేరని.. ఇలాంటి స్థితిలో చమురు ధరలు తగ్గించడం ఏ ప్రభుత్వానికి అయినా.. కష్టంతో కూడుకున్న వ్యవహారం అని తేల్చేశారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లాభాలు ప్రకటించినప్పటికీ.. చమురు ధరలు గరిష్టంగా ఉన్న సమయంలో రిఫైనరీలు భారీ నష్టాలు చవిచూశాయని గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు రేట్లు తగ్గించడంలేదని.. ఆ దిశగా చర్చలు జరగలేదని క్లియర్‌కట్‌గా చెప్పారు. మంగళవారం పెట్రోల్ బంక్‌ల్లో నిల్వలు తగ్గిపోవడం.. ప్రతీచోట నో స్టాక్ బోర్డులు కనిపించడంతో.. రేట్ల విషయంలో చర్చ మొదలైంది. రేట్లు తగ్గుతాయని ఎవరూ పెట్రోల్ కొనుగోలు చేయలేదని.. అందుకే కొరత వచ్చిందని.. ఎవరికి వారు ఊహించేసుకున్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో.. రేట్ల విషయంలో ఇప్పుడో క్లారిటీ వచ్చినట్లు అయింది.