SHARMILA ON JAGAN : ఇంత ఘోరంగా అవమానిస్తావా? షర్మిల తీరుపై కాంగ్రెస్ లీడర్ల ఆగ్రహం
ఎమ్మెల్యే కాదు.. ఎంపీ కాదు.. కనీసం వార్డు కౌన్సిలర్ కూడా కాదు. ఆ పార్టీ కోసం ఉద్యమాలు చేసి.. ఊరేగింపులు చేసి ఎదిగిన నేతా కాదు. జస్ట్ ఒక కండువా మెడలో వేయించుకొని.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ (Andhra Pradesh Congress) కమిటీకి అధ్యక్షురాలు అయిపోయింది వైఎస్ షర్మిల. బహుశా ఇలా కాంగ్రెస్ లో మాత్రమే జరుగుతుందేమో. ఇక ఏ పార్టీలోనూ ఇంత డైరెక్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరికీ ఉండదు.

Would you insult me so badly? Congress leaders are angry about Sharmila's behavior
ఎమ్మెల్యే కాదు.. ఎంపీ కాదు.. కనీసం వార్డు కౌన్సిలర్ కూడా కాదు. ఆ పార్టీ కోసం ఉద్యమాలు చేసి.. ఊరేగింపులు చేసి ఎదిగిన నేతా కాదు. జస్ట్ ఒక కండువా మెడలో వేయించుకొని.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ (Andhra Pradesh Congress) కమిటీకి అధ్యక్షురాలు అయిపోయింది వైఎస్ షర్మిల. బహుశా ఇలా కాంగ్రెస్ లో మాత్రమే జరుగుతుందేమో. ఇక ఏ పార్టీలోనూ ఇంత డైరెక్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరికీ ఉండదు.
అందుకేనేమో షర్మిల (YS Sharmila) తీరు జోరు మామూలుగా లేదు. హైదరాబాద్ లో కొడుకు రాజారెడ్డి (Raja Reddy) ఎంగేజ్మెంట్ (Engagement) పార్టీలో షర్మిల వ్యవహరించిన తీరు చాలా మంది నేతలకు మింగుడు పడటంలేదు. ఇదేం ఫంక్షన్..?.. ఇదేం పార్టీ..? అసలు మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఏం చేశారు ? షర్మిల కొడుకు నిశ్చితార్థం ఫంక్షన్ కి వచ్చిన జనమంతా ఇదే మాట. షర్మిల వ్యవహారం అంతా ఆ ఫంక్షన్ లో నవ్విపోదురు గాక.. నాకేటి సిగ్గు.. అన్నట్టుగా ఉందని వాపోతున్నారు పొలిటికల్ లీడర్స్. షర్మిల తన కొడుకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కోసం ఇన్విటేషన్లు పంచిన తీరు చూసి వెళ్లకుండా ఉండలేకపోయారు కాంగ్రెస్ నేతలు. తీరా అక్కడికి వెళ్ళాక.. వచ్చిన వాళ్లను పట్టించుకున్న వాళ్ళే లేరట. జానారెడ్డి లాంటి సీనియర్ నేత వేదిక ఎక్కగానే.. మీరు త్వరగా దిగాలండి ఎవరో వస్తున్నారు.. అని దాదాపు ఆయన్ని తోసేనంత పని చేశారట షర్మిల.
ఇక తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy, Venkata Reddy)పరిస్థితి మరీ దారుణం. ఈ స్టార్ క్యాంపెనర్ ని అక్కడ పట్టించుకునే వాడే లేరట. ఎంగేజ్మెంట్ వేదిక ఎక్కి.. ఏం చేయాలో తెలీక.. షేక్ హ్యాండ్ ఇచ్చి దిగిపోయారట కోమటిరెడ్డి. చాలామంది లీడర్ల పరిస్థితి ఇదే. ఐ డోంట్ కేర్ అన్న స్టైల్ లో వచ్చిన వాళ్ళని మాట వరసకైనా షర్మిల పలకరించకపోగా.. ఆ త్వరగా దిగి వెళ్ళండి అని సీనియర్ నేతల్ని కూడా కసురుకోవడం చాలా బాధపెట్టిందంట. అయినా ఏం అనుకొని ఏం లాభం.. వాళ్ల అన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికే దిక్కులేదు.. ఆయనే రెండు నిమిషాలు ఉండి కుటుంబంతో కలిసి పారిపోయాడు. ఇక మనం ఎంత అనుకున్నారట మిగిలిన నేతలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫంక్షన్ కి రాక బతికిపోయాడు. ఆయన వచ్చి ఉంటే ఏం జరిగి ఉండేదో.. అని మరి కొంతమంది నేతలు నవ్వుకున్నారట. మొత్తమ్మీద షర్మిల కొడుకు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో సాదర ఆహ్వానం లభించింది ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే.