DEVUDU SCRIPT : వైసీపీకి 11 మంది..దేవుడి స్క్రిప్టేనా ఆటాడుకుంటున్న నెటిజన్లు
ఏపీలో వైసీపీ మరీ 11 సీట్లకు పడిపోవడంతో ఆ పార్టీపై నెటిజన్లు, టీడీపీ అభిమానులు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. గతంలో జగన్ చెప్పిన దేవుడి స్క్రిప్ట్ ఇప్పుడు తన విషయంలోనే నిజం అయిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.

YCP 11 people..netizens who are playing God's script
ఏపీలో వైసీపీ మరీ 11 సీట్లకు పడిపోవడంతో ఆ పార్టీపై నెటిజన్లు, టీడీపీ అభిమానులు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. గతంలో జగన్ చెప్పిన దేవుడి స్క్రిప్ట్ ఇప్పుడు తన విషయంలోనే నిజం అయిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. అప్పట్లో ప్రతిపక్ష టీడీపీని ఉద్దేశించి జగన్ చెప్పిన డైలాగ్స్ ని ఆయనకే గుర్తు చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. 2014లో 106 సీట్లు సాధిస్తే… తర్వాత 23కు పడిపోయింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకున్నారు. వీళ్ళల్లో నలుగురికి మంత్రి పదవులు కూడా వచ్చాయి. ఆ తర్వాత 2019లో జగన్ సీఎం అయ్యాక… టీడీపీ తరపున 23 మంది ఎమ్మెల్యేలే గెలవడంపై తరుచుగా కామెంట్స్ చేసేవారు. తమ 23 మందిని లాక్కున్నారు కాబట్టి… దేవుడు సరిగ్గా అంతమందినే గెలిపించాడనీ… ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ… ఎన్నో సభల్లో ఎద్దేవా చేశారు జగన్.
సీన్ కట్ చేస్తే… ఇప్పుడు 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమికి 164 సీట్లు దక్కాయి. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. దాంతో టీడీపీ కూటమి సాధించిన 164లో అంకెలన్నింటినీ కూడితే 11 నెంబర్ వస్తుంది. ఇది కూడా దేవుడు స్క్రిప్టే జగన్… అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. మొన్నటిదాకా యాక్టివ్ గా ఉండి రియాక్ట్ అయిన వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు సైలెంట్ అయింది. కానీ జగన్ దేవుడి స్క్రిప్ట్ డైలాగ్స్ పై ట్రోలింగ్స్ మాత్రం ఆగడం లేదు.