YCP : వైసీపీ చిత్తుచిత్తు.. కూటమిదే అధికారం.. ఇండియాటుడే మై యాక్సిస్ సంచలన ఎగ్జిట్‌పోల్…
ఏపీ అసెంబ్లీ (AP Assembly Elections) ఫలితాలపై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఒక్క ఎగ్జిట్‌పోల్ (Exit Polls) .. ఒక్కోలా ఉండడంతో.. ఏది నిజం అవుతుంది..

YCP Chitchittu.. Coalition is the power.. Indiatoday My Axis Sensational Exit Poll...
ఏపీ అసెంబ్లీ (AP Assembly Elections) ఫలితాలపై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఒక్క ఎగ్జిట్‌పోల్ (Exit Polls) .. ఒక్కోలా ఉండడంతో.. ఏది నిజం అవుతుంది.. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే చర్చ.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది. ఇండియాటుడే (India Today) మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్.. చాలాసార్లు నిజం అయింది. ఆ సంస్థ అంచనాలు జెన్యూన్‌గా ఉంటాయన్నది చాలామంది ఫీలింగ్. దీంతో ఆ సంస్థ సర్వేపై.. అంచనాలపై.. ప్రతీ ఒక్కరిలో ఆసక్తి కనిపించింది. ఏపీలో కూటమికి క్లియర్‌కట్ మెజారిటీ ఖాయం అని.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని..
ఇండియాటుడే మైయాక్సిస్ సంస్థ తేల్చేసింది. వైసీపీ నుంచి కూటమి అధికారం లాక్కోవడం ఖాయం అని అంచనా వేసింది. కూటమికి 98 నుంచి 120 సీట్లు వస్తాయని.. వైసీపీ 55 నుంచి 77 సీట్లకు పరిమితం అవుతుందని ఎగ్జిట్‌పోల్ అనౌన్స్ చేసింది. కూటమి పార్టీల్లో.. టీడీపీకి 78 నుంచి 96 స్థానాలు.. జనసేనకు 16 నుంచి 18 స్థానాలు.. బీజేపీకి 4 నుంచి 6 స్థానాలు గెలుస్తాయని ఇండియా టుడే మై యాక్సిస్ సంస్థ తెలిపింది. వైసీపీ 55 నుంచి 77 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. కాంగ్రెస్ రెండు స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని తేల్చింది.
ఇక ఇప్పటికే ఎంపీ సీట్లపై కూడా ఇండియాటుడే మై యాక్సిస్ సంస్థ.. ఎగ్జిట్‌పోల్ అనౌన్స్ చేసింది. కూటమి 21 నుంచి 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని.. వైసీపీ 2 నుంచి 4 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. వైసీపీకి ఘోర పరాభవం ఖాయమని.. దానికి కారణాలు కూడా చెప్పింది ఆ సంస్థ. చంద్రబాబు జైలుకు వెళ్లడం.. వైసీపీకి భారీ మైనస్‌గా మారిందని.. దీనికితోడు టీడీపీ (TDP), బీజేపీ (BJP), జనసేన.. సరైన సమయంలో కూటమిగా ఏర్పడ్డాయని.. అది కలిసి వచ్చిందని.. విజయానికి కారణం అవుతుందని అంచనా వేసింది. ఐతే ఇండియా టుడే మై యాక్సిస్ సంస్థ ఎగ్జిట్‌పోల్‌ను వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. గెలిచేది తామే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫలితాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయ్.