YCP, Congress : YSR 75వ జయంతి వేడుకలకు YCP భారీ ఏర్పాట్లు..
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ సీపీ పార్టీ సిద్ధమైంది.

YCP makes huge arrangements for YSR 75th birth anniversary celebrations.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ సీపీ పార్టీ సిద్ధమైంది. దీంతో పార్టీ శ్రేణులందరూ ఇందులో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపినిచ్చారు. ప్రతి ఊరిలో వైసీపీ అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
మరో వైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో వైఎస్ఆర్ 75వ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించాలని ఏపీ పీసీసీ చీఫ్, వైఎస్ కుమార్తె షర్మిల నిర్ణయించారు. దీంతో ఈ జయంతి వేడుకలకు హాజరు కావాలని సోనియా, రాహుల్ గాంధీలు సహా పలువురి కీలక నేతలకు ఆహ్వానం పంపించారు. తెలంగాణ, నుంచి సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక నుంచి కాంగ్రెస్ కీలక నేతలు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు కూడా ఆహ్వానం అందినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.