Jana Sena, Pawan Kalyan : విశాఖ సౌత్ నుంచి జనసేన అభ్యర్థిగా.. YCP ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.. కాగా ఇది వరకే జనసేన అభ్యర్థుల స్థానాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.

YCP MLC Vamsikrishna Srinivas Yadav as Jana Sena candidate from Visakha South
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.. కాగా ఇది వరకే జనసేన అభ్యర్థుల స్థానాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తాజా మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు పవన్.
విశాఖ సౌత్ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. పిఠాపురం పర్యటనలో ఉన్న జనసేనాని పార్టీ నేతలతో చర్చించిన తర్వాత వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేశారు. అధికార పార్టీ వైసీపీ నుండి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించినట్లు ప్రకటించారు. వంశీకృష్ణకు విశాఖ సౌత్ టికెట్ కేటాయిస్తారని చాలా కాలంగా ప్రచారం ఉంది. ఇప్పుడు అధికారిక ప్రకటనతో వంశీకృష్ణకు టికెట్ ఖరారయ్యింది. దాంతో జనసేన ఇప్పటివరకు 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా 21అసెంబ్లీ స్థానాలు 2ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన ఇంకా అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అవనిగడ్డ స్థానానికి ఆశావహులు ఎక్కువమంది ఉన్న నేపథ్యంలో సర్వే జరిపిన తర్వాత వచ్చిన ఫలితాన్ని బట్టి అభ్యర్థిని ప్రకటిస్తామని జనసేనాని ఇప్పటికే ప్రకటించారు.
2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు.
SURESH.SSM