చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ ఎంపీ హాట్ కామెంట్స్
వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అవుతున్న రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ పార్టీ అధినేత జగన్ లక్ష్యంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు.
వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అవుతున్న రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ పార్టీ అధినేత జగన్ లక్ష్యంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్మోహన్ రెడ్డికి నాకు విభేదాలు ఉన్నాయన్ని ఆ విభేదాల గురించి నేను బయటకు చెప్పలేను అన్నారు ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చకే పార్టీకి పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నాను అని స్పష్టం చేసారు. నేను చూడని అధికారం… పదవులు లేవు అన్నారు మోపిదేవి. అధికారం కోసం నేను టిడిపిలో చేరడం లేదన్న మోపిదేవి…
ఆక్టివ్ పాలిటిక్స్ లో ఉండాలని నేను అనుకుంటున్నానని పేర్కొన్నారు. టిడిపి అధికారంలో ఉంది చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరనే ఉద్దేశంతోనే టిడిపిలో జాయిన్ అవుతున్నానని జగన్ ప్రజలకు సంక్షేమం అందించారు కానీ అభివృద్ధిని గాలికి వదిలేశారు అన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు బేరీజు వేసుకుంటూ పాలన సాగించాలి కాని జగన్ అలా చేయలేదు అని ఆయన ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులకు జగన్ దిగారు అని మండిపడ్డారు.
చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు కూడా మేమందరం వద్దని చెప్పాం అని మా మాటను జగన్ లెక్క చేయలేదు అని ఆరోపించారు. నిరంకుశ ధోరణితో జగన్ వ్యవహరించారన్నారు మోపిదేవి. దాని పర్యవసానం ప్రజలు ఓటు రూపంలో తీర్పు ఇచ్చారు అని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని ఎద్దేవా చేసారు.