YCP Mps Jump : నలుగురు వైసీపీ ఎంపీలు జంప్… లైన్ లో ఇంకా ఎంతమంది ?

ఆంధ్రప్రదేశ్ వైసీపీలో ఎంపీల రాజీనామాల పర్వం కొనసాగుతోంది.  మార్పులు, చేర్పులతో కొంతమంది, అసలు అధికారంలేని పార్టీలో ఉంటే ఎంత... పోతే ఎంత అని కొందరు ఎంపీలు వైసీపీకి గుడ్ బై కొడుతున్నారు. జగన్ పార్టీలో డమ్మీ ఎంపీలుగా ఉండటం కంటే... వేరే పార్టీ నుంచి స్వతంత్ర్యంగా బతకొచ్చని భావిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2024 | 11:15 AMLast Updated on: Jan 24, 2024 | 11:15 AM

Ycp Mps Jump

ఆంధ్రప్రదేశ్ వైసీపీలో ఎంపీల రాజీనామాల పర్వం కొనసాగుతోంది.  మార్పులు, చేర్పులతో కొంతమంది, అసలు అధికారంలేని పార్టీలో ఉంటే ఎంత… పోతే ఎంత అని కొందరు ఎంపీలు వైసీపీకి గుడ్ బై కొడుతున్నారు. జగన్ పార్టీలో డమ్మీ ఎంపీలుగా ఉండటం కంటే… వేరే పార్టీ నుంచి స్వతంత్ర్యంగా బతకొచ్చని భావిస్తున్నారు.  నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైసిపికి, ఎంపీ పదవికి రెండింటికి రాజీనామా చేశారు. జగన్ తన పట్ల అనుసరిస్తున్న ధోరణిని నిరసిస్తూ వైసీపీకి దండం పెట్టేసారు కృష్ణదేవరాయులు. నేను నా నియోజకవర్గం నరసరావుపేట నుంచి పోటీ చేస్తానంటే… కాదు… నువ్వు గుంటూరు ఎంపీగానే వెళ్లాలని జగన్ ఆదేశించడం కృష్ణదేవరాయలకు మింగుడు పడలేదు. నరసరావుపేట పరిధిలో

నాలుగు ఎమ్మెల్యే సీట్లను నేరుగా కృష్ణదేవరాయలు ప్రభావితం చేయగలరు. వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి ఈ నాలుగు నియోజకవర్గాల్లో కృష్ణదేవరాయలు హవా నడుస్తోంది. నరసరావుపేట  పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా మా ఎంపీ ని మార్చొద్దు బాబో అని జగన్ కి మొరపెట్టుకున్నాకూడా ఆయన వినడం లేదు. కృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్లాల్సిందేనని హుకుం జారీ చేశారు జగన్. అంతేకాదు అక్కడ నాగార్జున యాదవ్ అనే బీసీ నాయకుడిని పోటీకి సిద్ధం చేసారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. అయితే వైసీపీ ఇంటర్నల్ వర్గాలు చెబుతున్న వెర్షన్ మరోరకంగా ఉంది. రెండేళ్లుగా కృష్ణదేవరాయులు టీడీపీతో టచ్ లో ఉన్నాడనీ…. టిడిపి కి వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. ఇదంతా తెలిసే జగన్ బీసీ నాయకుడిని తయారు చేసి పెట్టుకున్నారని, కృష్ణదేవరాయలు టిడిపికి వెళ్లడం ఖాయమని వైసీపీ నాయకులు చెప్తున్నారు. మొత్తం మీద ఎన్నికలకు ముందే నలుగురు ఎంపీలు వైసీపీకి గుడ్ బై చెప్పేసారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల క్రితమే పార్టీకి దూరమయ్యారు. కర్నూలు ఎంపీ సంజీవరావు కూడా ఇటీవలే వైసిపికి గుడ్ బై చెప్పారు. బందరు ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇప్పుడు లావు కృష్ణదేవరాయులు వైసీపీకి టాటా చెప్పేశారు. మరికొద్ది రోజుల్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా వైసీపీని వదిలిపెట్టే సూచనలు ఉన్నాయి.

నిజానికి వైసీపీలో ఎంపీలందరూ డమ్మీ క్యాండిట్లే. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే రాజ్యం. ఎంపీలకు ఏ పాత్ర ఉండదు. ఇక ఢిల్లీలో విజయసారెడ్డి. మిధున్ రెడ్డిదే రాజ్యం. అక్కడ ఎంపీలు చేసేది ఏమీ ఉండదు. వైసీపీ…. బిజెపికి అనుకూలం కాబట్టి సభలో ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఢిల్లీలో అడుగు తీసి అడుగు పెడితే విజయసాయి రెడ్డికి కచ్చితంగా సమాచారం ఇవ్వాల్సిందే. స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోవడానికి కుదరదు. ఏ కేంద్ర మంత్రిని కలవడానికి సాధ్యం కాదు. మిధున్ రెడ్డి, సాయి రెడ్డి కనుసన్నలోనే తిరగాలి. ఒక పైరవీ చేసుకునే అవకాశం గానీ… ఏదైనా కాంట్రాక్ట్ తెచ్చుకునే అవకాశం గానీ కూడా లేదని వైపీపీ ఎంపీలు ఆఫ్ ద రికార్డు గోడువెళ్ళబోసుకుంటుంటారు. పోనీ తమ గోడు చెప్పుకుందామని వస్తే… జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడు. ఏం మాట్లాడాలో తెలియదు ఏం మాట్లాడకూడదు తెలీదు. వైసీపీ ఎంపీలు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అందుకే ఒక్కొక్కరు బయటపడుతున్నారు. వేరే పార్టీ కెళ్ళి గెలుస్తామని నమ్మకం లేని వాళ్ళు వైసీపీలోనే ఉండి సొంత పార్టీకి సర్వీస్ చేసుకుంటున్నారు.