AP Srikakulam Politics : సిక్కోలు సీటుపై వైసీపీ కన్ను… తిలక్ తో రామ్మోహన్ కి చెక్ !
శ్రీకాకుళం (Srikakulam) లోక్ సభ (Lok Sabha ) సీటును వరుసగా గెలుచుకుంటోంది టీడీపీ(TDP) . తమకు కొరకరాని కొయ్యగా మారిన ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం రకరకాల ఈక్వేషన్స్ లో పేర్లను పరిశీలించింది వైసీపీ (YCP) అధినాయకత్వం. అంగ బలం, ఆర్థిక బలం ఉన్న చాలా మంది నేతల పేర్లు పరిశీలనకు వచ్చాయట. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ లేదా మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుల్లో ఒకరిని బరిలో దింపాలని కూడా అనుకుందట.
శ్రీకాకుళం (Srikakulam) లోక్ సభ (Lok Sabha ) సీటును వరుసగా గెలుచుకుంటోంది టీడీపీ(TDP) . తమకు కొరకరాని కొయ్యగా మారిన ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం రకరకాల ఈక్వేషన్స్ లో పేర్లను పరిశీలించింది వైసీపీ (YCP) అధినాయకత్వం. అంగ బలం, ఆర్థిక బలం ఉన్న చాలా మంది నేతల పేర్లు పరిశీలనకు వచ్చాయట. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ లేదా మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుల్లో ఒకరిని బరిలో దింపాలని కూడా అనుకుందట. ఎక్కడా లెక్క కుదరకపోవడంతో… రకరకాలుగా శోధించి చివరికి కులం కోణంలో సాధించిందంటున్నాయి రాజకీయ వర్గాలు. అన్నిటికంటే పవర్‌ఫుల్‌గా ఉండే సామాజిక కోణాన్ని టచ్ చేస్తూ… కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్‌ను ఫైనల్ చేసింది. జిల్లాలో వెలమ వర్సెస్ కాళింగ సామాజిక వర్గాల మధ్య ఉన్న రాజకీయ ఆధిపత్య పోరును అనుకూలంగా మార్చుకోవాలన్న టార్గెట్‌తో పేరాడ వైపు మొగ్గినట్టు తెలిసింది.
వెలమ సామాజికవర్గానికి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడిని (Rammohan Naidu) ఢీ కొట్టడానికి కాళింగ అభ్యర్థి పేరాడ తిలక్ సరిపోతారని వైసీపీ పెద్దలు లెక్కలేసినట్టు తెలుస్తోంది. గతంలో కాళింగ సామాజిక వర్గానికే చెందిన దువ్వాడ శ్రీనివాస్ గట్టిపోటీ ఇవ్వగలిగారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి దివంగత నేత ఎర్రన్నాయుడుపై విజయం సాధించారు. నాడు వర్క్ అవుట్ అయిన ఫార్ములాను మరోసారి ప్రయోగించేందుకు సిద్ధమైందట వైసీపీ హైకమాండ్.
దువ్వాడ శ్రీనివాస్ గతంలో గట్టి పోటీ ఇచ్చినా… కాళింగ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పేరాడ తిలక్ రకరకాల కార్యక్రమాలతో ముందున్నారని, ఆయన అభ్యర్థి అయితే కాళింగుల ఓట్లన్నీ సాలిడ్ అవుతాయన్నది పార్టీ పెద్దల అంచనాగా చెప్పుకుంటున్నారు. సామాజిక వర్గంతో పాటు తిలక్‌కు రకరకాల ఫ్యాక్టర్స్ పని చేస్తాయని లెక్కలేస్తున్నారు వైసీపీ లీడర్స్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కంటే పేరాడకు అన్ని నియోజకవర్గాల్లో విస్తృత పరిచయాలున్నాయి. వర్గాలతో సంబంధం లేకుండా అంతా సహకరించే అవకాశం ఉందంటున్నారు. దువ్వాడ వైఖరి నచ్చని నేతలే గత ఎన్నికలలో ఓటమికి కారణంగా పార్టీ పోస్ట్ మార్టంలో తెలిసిందట. అందుకే ఈసారి అభ్యర్థి మార్పు తప్పలేదంటున్నారు. తిలక్ పేరు ప్రకటించగానే… టెక్కలిలో అసమ్మతికి చెక్ పెడిందట. టెక్కలి ఎమ్మెల్యే సీటుతో పాటు శ్రీకాకుళం లోక్ సభ స్థానంలో గెలుపుకు బాటలు వేయటంలో ఈ ఈక్వేషన్స్ పనికివస్తాయని ఆశిస్తున్నాయి వైసీపీ శ్రేణులు. టీడీపీ తరపున మరోసారి ఎంపీ బరిలో దిగబోతున్నారు రామ్మోహన్ నాయుడు.
ఈసారి వైసీపీ అభ్యర్థి మార్పుతో పోటీ రసవత్తరంగా మారవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. ప్రతిపక్షం నుంచి రామ్మోహన్ నాయుడు బలమైన అభ్యర్థి అయితే… అధికార పార్టీ తరపున తిలక్ పేరు ప్రకటించాక ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ల మధ్య సమన్వయం కుదిరిందని, దీంతో ఈసారి పోటీపై ఆసక్తి పెరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. మరి వైసీపీ ప్రయోగించిన ఈ సామాజిక, సమన్వయ అస్త్రం ఫలిస్తుందా లేక మళ్ళీ మిస్‌ఫైర్ అవుతుందా అన్నది చూడాలి.