Modi, Pawan Kalyan : నిన్న చంద్రబాబు.. ఇవాళ మోడీ పవన్ రాజకీయ వారసుడు అకీరానేనా ?
ఎట్టకేలకు జనసైనికుల పదేళ్ల కల నెరవేరింది. ఏపీ అసెంబ్లీలో (AP Assembly) ఎమ్మెల్యేగా పవన్ (Pawan Kalyan) అడుగుపెట్టడమే కాకుండా.. అలయన్స్‌లో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఎట్టకేలకు జనసైనికుల పదేళ్ల కల నెరవేరింది. ఏపీ అసెంబ్లీలో (AP Assembly) ఎమ్మెల్యేగా పవన్ (Pawan Kalyan) అడుగుపెట్టడమే కాకుండా.. అలయన్స్‌లో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా ఫ్యాన్స్ (Mega fans) అంతా ఫుల్ ఖుషీ. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో గెలిచిన తరువాత వరుసగా పవన్ చంద్రబాబును, మోడీని (Modi) కలిశారు. ఎప్పుడూ లేనిది ఈ రెండు మీటింగ్‌లకు అకీరాను కూడా తీసుకువెళ్లాడు.
దీంతో పవన్ తరువాత అకీరా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా అనే చర్చ మొదలైంది. ఈ చర్చ రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అకీరా, ఆద్య ఇద్దరూ ఎప్పుడూ పెద్దగా బయటికి రారు. ఏవో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే తప్ప కెమెరా ముందుకు కూడా రారు. కానీ అలాంటిది పవన్ అలా గెలిచాడో లేదో అనాతో కలిసి అకిరా పవన్ ఫ్యాన్స్‌ను కలిశాడు. తండ్రితో కలిసి వెళ్లి చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్నాడు. నేరుగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కూడా కలిశాడు. ఎప్పుడూ లేనిది ఇలా పవన్ స్వయంగా అకీరాను ఇలా పొలిటీషియన్స్‌తో ఇంటరాక్ట్ చేయించడంతో అకీరా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే వాదన మొదలయ్యింది. కానీ నిజానికి ఇలాంటి పవన్‌కు ఇష్టమా అంటే.. లేదు. రాజకీయాల్లో తనకు వారసత్వం ఇష్టం ఉండదని.. తన పిల్లలే ఏం అవ్వాలి అనుకుంటారో అది ఇష్టమంటూ చెప్పారు.
సినిమాల్లో ఐనా రాజకీయాల్లో ఐనా ఇదే తన స్టాండ్ అంటూ పవన్ చాలా సార్లు చెప్పారు. దీంతో అకీరా పాలిటిక్స్‌లోకి రాడు అని చాలా మంది పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. జనసేనను తనలా ఎవరూ లీడ్ చేయలేరు అనుకున్నప్పుడు అకీరానే పవన్ దింపొచ్చు. ఏం జరుగుతుందో ముందే ఊహించేందుకు మనం జోతిష్యులం కాకపోయినా.. అకీరా ఇలా వరుసగా పొలిటికల్ మీటింగ్స్‌కు వెళ్లడం మాత్రం చాలా ఆలోచించదగ్గర విషయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.