Janasena, Pawan Kalyan : జనసేనలోకి యంగ్ లీడర్స్.. దిమ్మతిరిగే వ్యూహం సిద్ధం చేసిన పవన్..
ఎదురుదెబ్బ తగిలినప్పుడు దాన్నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే జీవితంలో ముందుకు వెళ్లడం కష్టం. రాజకీయాల్లో ఐతే అసంభవం. ఇదే విషయాన్ని క్లియర్‌గా అర్థం చేసుకున్నారనుకుంటా.. ఏపీ పాలిటిక్స్ (AP Politics) ను షేక్ చేసే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Young leaders in the Jana Sena.. Pawan has prepared a mind-boggling strategy..
ఎదురుదెబ్బ తగిలినప్పుడు దాన్నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే జీవితంలో ముందుకు వెళ్లడం కష్టం. రాజకీయాల్లో ఐతే అసంభవం. ఇదే విషయాన్ని క్లియర్‌గా అర్థం చేసుకున్నారనుకుంటా.. ఏపీ పాలిటిక్స్ (AP Politics) ను షేక్ చేసే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) . ఏపీలో ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగా ఉన్నా.. టీడీపీ (TDP) తో కలిసి ఎన్నికలకు వెళ్తున్నా.. తనకంటూ సరికొత్త వ్యూహాన్ని పవన్ (Pawan) సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన కూటమి గెలిస్తే పవన్ సీఎం అవుతారన్న గ్యారంటీ లేదు. సీఎం సీటు డిమాండ్ చేసే స్థాయిలో ఎమ్మెల్యేలు ఉంటే తప్ప అది సాధ్యం కాదు. దీంతో ఇప్పుడు తన బలం పెంచుకునే పనిలో పవన్ ఉన్నట్టు జనసేన వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఇప్పటకే 175 నియోజకవర్గాల సమాచారాన్ని పవన్ స్టడీ చేశారట. ఏ స్థానంలో పరిస్థితి ఎలా ఉంది అని క్లియర్ అంచనాకు కూడా వచ్చారట. వీటన్నిటి తరువాత సీట్ల పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
జనసేన (Janasena) కేటాయించే సీట్లలో అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారట పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగానే వెనకబడ్డ కులాలకు ఎక్కువ ప్రధాన్యత ఇచ్చేలా సీట్లు పంపిణీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట. ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎక్కువ ప్రధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ముందు నుంచి జనసేనకు అండగా ఉన్న అన్ని కులాలను పోటీ ఉంచాలని పవన్ భావిస్తున్నారట. ఇది వచ్చే ఎన్నికల్లో జనసేనకు ప్లస్ అవుతుందని పవన్ భావిస్తున్నట్టు చెప్తున్నారు. గతంతో కంపేర్ చేస్తే ఏపీలో ఇప్పుడు జనసేన స్ట్రాంగ్‌గా ఉంది. దానికి తోడు టీడీపీ పొత్తు కూడా ఉంది. బీజేపీని కూడా తమతో కలుపుకునేందుకు పవన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బలంతో పాటు అన్ని సామాజికవర్గాల నుంచి సమానమైన ఆదరణ ఉంటే.. అధికారంలోకి రావడం గ్యారంటీ. కానీ ప్రస్తుతం కొన్ని కులాలు మాత్రమే జనసేన, టీడీపీకి మద్దతుగా ఉన్నాయి.
దీంతో అన్ని కులాలను తమవైపు తిప్పుకునేలా సీట్ల కేటాయింపు చేసేందుకు జనసేన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన నుంచి దాదాపుగా యంగ్ లీడర్స్ పోటీలో ఉండబోతున్నట్టు సమాచారం. టీడీపీతో సీట్ల పంపిణీ విషయంలో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గేందుకు పవన్ సిద్ధంగా లేరని సమాచారం. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత, టీడీపీతో పొత్తు, ప్రజల్లో పెరిగిన బలం. వీటితో పాటు సామాజిక సమీకరణాలు కూడా క్లియర్‌గా లెక్కలు గట్టి వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పవన్ వ్యూహం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పవన్‌ను రెండు స్థానాల్లో ఓడించిన ఏపీ ప్రజలపై.. జనసేనాని వ్యూహం ఈసారి ఎలా పని చేస్తుందో చూడాలి మరి.