YS JAGAN: పవన్‌ను తిట్టే తిట్లే.. జగన్ కొంప ముంచుతున్నాయా..?
ఒక్క విషయంలో మాత్రం జగన్ అంచనాలు తలకిందులు అవుతున్నాయనే చర్చ జరుగుతోంది. అదే పవన్ కల్యాణ్‌ను తిట్టడం. ఒకసారి, రెండుసార్లు అంటే పర్లేదు.. దత్తపుత్రుడు అనే మాట దగ్గర ఆగిపోయినా పర్లేదు. కానీ జగన్ మాత్రం పవన్ పర్సనల్ లైఫ్‌ను టార్గెట్ చేస్తున్నారు.
YS JAGAN: వైనాట్ 175 అంటూ.. మళ్లీ అధికారమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. తెలంగాణ ఫలితాలు చూసి మారిపోయారో.. లేదంటే అసలు విషయం తెలుసుకున్నారో కానీ.. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తున్నారు. మరికొందరికి స్థానచలనం చేస్తున్నారు. టీడీపీ, జనసేన కలిసిపోయి సమరభేరి మోగించిన వేళ.. ఒక్కటి మాత్రం క్లియర్‌గా అర్థం అవుతోంది. వైసీపీ నేతల్లో, జగన్‌లో టెన్షన్ మొదలైందని ఈజీగా అర్థం అవుతోంది. ఏ చిన్న పొరపాటు కూడా ప్రత్యర్థికి ఆయుధం కావొద్దు అన్నట్లుగా జగన్ నిర్ణయాలు కనిపిస్తున్నాయ్. ఐతే ఒక్క విషయంలో మాత్రం జగన్ అంచనాలు తలకిందులు అవుతున్నాయనే చర్చ జరుగుతోంది. అదే పవన్ కల్యాణ్‌ను తిట్టడం.
MALLAREDDY: మల్లారెడ్డిపై మరో కేసు! రోడ్డెక్కిన బాధితులు..
ఒకసారి, రెండుసార్లు అంటే పర్లేదు.. దత్తపుత్రుడు అనే మాట దగ్గర ఆగిపోయినా పర్లేదు. కానీ జగన్ మాత్రం పవన్ పర్సనల్ లైఫ్‌ను టార్గెట్ చేస్తున్నారు. పెళ్లిళ్ల విషయంలో ప్రతీ సభలో కొత్త కొత్త తిట్లు తిడుతున్నారు జగన్. ఇదే ఆయనకు మైనస్ కాబోతుందా.. వైసీపీ కొంప ముంచబోతుందా అంటే.. కాదు అనడానికి మాత్రం లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఓటమి భయంతో విపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలకు దిగడం.. ఓ వర్గం జనాల్లో, ఓటర్లలో చర్చకు దారి తీస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు కన్ఫార్మ్ అయిన తర్వాత.. జగన్ లిమిట్ మరింత క్రాస్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో.. ఇలా వ్యక్తిగతంగా మాటల దాడి చేస్తే.. పరిస్థితి తేడా కొట్టే అవకాశం ఉంటుంది. ప్రతికూల ప్రభావం పడడం ఖాయం అని.. గెలుపు అవకాశాలను దెబ్బ తీసే ప్రమాదం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఇలా పవన్‌ను పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ.. జగన్ విమర్శలు గుప్పించడం సరికాదని సూచిస్తున్నారు. జనాలు అన్నీ పరిశీలిస్తున్నారని.. తమదైన రోజు పవర్ ఏంటో చూపిస్తారు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. జగన్ ఎంత పర్సనల్ కామెంట్లు చేస్తున్నా.. పవన్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. అది జనసేనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందన్నది మరో అంచనా. రాజకీయ విషయాలు.. ప్రభుత్వపరమైన విషయాల జోలికి తప్ప.. పవన్ పెద్దగా వేటినీ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఈ ధోరణి.. జగన్ మీద మరింత వ్యతిరేకతను.. పవన్‌కు మరింత పాజిటవ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంటుందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయ్.