YS JAGAN: కేసీఆర్‌తో జగన్ రహస్య చర్చలు.. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు..?
దాదాపుగా 40 నిమిషాల పాటు.. కేసీఆర్‌తో జగన్ చర్చలు జరిపారు. జగన్ వచ్చింది పరామర్శ కోసం మాత్రమే కాదు. అంతకుమించి అని రాజకీయం తెలిసిన వాళ్లకు ఎవరికైనా అర్థమైపోతుంది ఈజీగా! ఏపీలో రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
YS JAGAN: తుంటి ఆపరేషన్ కావడంతో.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నంది నగర్‌లోని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆపరేషన్ అయినప్పటి నుంచి కేసీఆర్ ఫ్యామిలీతో ఫోన్‌లో టచ్‌లో ఉన్న జగన్.. ఇప్పుడు స్వయంగా హైదరాబాద్ వచ్చి పరామర్శించి వెళ్లారు. ఇప్పుడే వీలు కుదిరిందా.. పరిస్థితులు రప్పించాయా తెలియదు కానీ.. షర్మిల కాంగ్రెస్‌లో చేరిన వేళ జగన్ హైదరాబాద్ రావడం.. కేసీఆర్‌తో భేటీ కావడం.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపుగా 40 నిమిషాల పాటు.. కేసీఆర్‌తో జగన్ చర్చలు జరిపారు. జగన్ వచ్చింది పరామర్శ కోసం మాత్రమే కాదు. అంతకుమించి అని రాజకీయం తెలిసిన వాళ్లకు ఎవరికైనా అర్థమైపోతుంది ఈజీగా!
YS SHARMILA: ఎక్కడా కనిపించని జగన్, షర్మిల మీటింగ్ ఫొటోలు.. వాటిని ఆపింది ఆయనేనా..?
ఏపీలో రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు ఎవరూ లేకుండా వారిద్దరే పలు అంశాలపై మాట్లాడుకున్నారని తెలుస్తోంది. కేసీఆర్, జగన్ మధ్య మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఉద్యమం సమయంలో జగన్ సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచిన సమయంలో రెండు పార్టీల మధ్య వివాదం ఏర్పడింది. ఐతే రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితి మారిపోయింది. ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యారు. తెలంగాణలోనూ ఆయన రాజకీయాలు చేస్తుండడంతో.. టీడీపీకి రిటర్న్‌గిఫ్ట్ కాన్సెప్ట్‌తో ఆ మధ్య జగన్‌కు కేసీఆర్ రాజకీయంగా సాయం చేశారనే గాసిప్ ఉంది. ఇది నిజమా, అబద్దమా అన్న సంగతి ఎలా ఉన్నా.. వైసీపీ, బీఆర్ఎస్ మధ్య మంచి రాజకీయ సంబంధాలు అయితే కొనసాగాయ్. ఐతే ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా దాదాపు అన్ని పార్టీలు ఏకం అవుతున్నాయ్.
ఇలాంటి పరిస్థితుల మధ్య.. 40నిమిషాల పాటు ఇద్దరు ఏం మాట్లాడుకొని ఉంటారనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తరపున వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. కీలక పాత్ర పోషించారు. సర్వేలు, అభ్యర్థులు, అభ్యర్థులకు ఆర్థిక సాయం విషయంలో ఆయన కీలకంగా వ్యవహరించారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తూ ఉంటాయ్. ఐతే కేసీఆర్, జగన్ చర్చలు జరిపిన సమయంలో ఈసారి ఆయన కూడా పక్కన లేనట్లు తెలుస్తోంది. మార్చి, ఏప్రిల్‌లో ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయ్. ఈ ఎన్నికల వ్యూహాలపై కేసీఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్.