YS JAGAN: చిన్నారికి తండ్రి పేరు పెట్టిన జగన్.. తండ్రి అంటే జగన్‌కు ఇంత ఇష్టమా..
తనకు రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే ఎంతో అభిమానమని వరప్రసాద్ చెప్పడంతో.. తన తండ్రి పేరే బిడ్డకు పెడదామంటూ సూచించారు జగన్. స్వయంగా బిడ్డకు రాజశేఖర్ అని పేరు పెట్టి దీవించారు.

YS JAGAN: ఏపీ సీఎం జగన్‌కు తన తండ్రి అంటే ఎంత ఇష్టమో మరోసారి రుజువు చేసుకున్నారు. ఓ వైసీపీ కార్యకర్త బిడ్డకు స్వయంగా తన తండ్రి పేరు పెట్టి దీవించారు. ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు ఏపీలో జగన్ పాదయాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా దువ్వూరు మండలంలోని జిల్లెళ్ల గ్రామంలో ఆయన పర్యటించారు. ఇదే సమయంలో వరప్రసాద్ అనే వైసీపీ కార్యకర్త తన బిడ్డను తీసుకుని జగన్ దగ్గరికి వచ్చాడు. తన బిడ్డకు పేరు పెట్టాలంటూ జగన్‌ను కోరాడు.
Grandhi Srinivas: పవన్ కల్యాణే కావాలి.. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్..!
తనకు రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే ఎంతో అభిమానమని వరప్రసాద్ చెప్పడంతో.. తన తండ్రి పేరే బిడ్డకు పెడదామంటూ సూచించారు జగన్. స్వయంగా బిడ్డకు రాజశేఖర్ అని పేరు పెట్టి దీవించారు. తమ అభిమాన నాయకుడు స్వయంగా తన తండ్రి పేరు బిడ్డకు పెట్టడంతో వరప్రసాద్ దంపతుల ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. గతంలో ఓ సారి ఓ బిడ్డకు జగన్ పేరు పెట్టారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో ఓ వైసీపీ కార్యకర్త తన బిడ్డను తీసుకుని జగన్ దగ్గరకు వచ్చాడు. తన బిడ్డకు పేరు పెట్టాలంటూ కోరాడు. దీంతో జగన్ ఆ బిడ్డకు దేవుడు అంటూ పేరు పెట్టాడు. కానీ ఇప్పుడు స్వయంగా తన తండ్రి పేరే బిడ్డకు పెట్టడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
దీంతో జగన్‌కు తండ్రి అంటే ఇంత ప్రేమా అంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. జగన్ బిడ్డకు పేరు పెట్టిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.