YS JAGAN: జనంలోకి వెళ్లేందుకు సిద్ధమైన జగన్.. ఏపీ వ్యాప్తంగా టూర్..
ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. దీనిలో భాగంగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మారుస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
YS JAGAN: వైసీపీ అధినేత, సీఎం జగన్ త్వరలో ఏపీలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న జగన్ త్వరలో ఏపీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జనవరి 21 నుంచి జగన్ పర్యటన సిద్ధం కానుందని తెలుస్తోంది. ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. దీనిలో భాగంగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మారుస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.
T CONGRESS: ఎప్పుడంటే.. తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారంటే..
మరోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి 21 నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు జనంలో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు జగన్. దీని కోసం ప్రత్యేక కార్యక్రమం రూపొందించే పనిలో ఉంది వైసీపీ అగ్ర నాయకత్వం. జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీలోని ముఖ్య నేతలు పర్యవేక్షిస్తున్నారు. జగన్ పర్యటనకు పేరు, రూట్ మ్యాప్, ఎక్కడ ప్రారంభించి ఎక్కడ పూర్తి చేయాలనే అంశాలపై కసరత్తు కొనసాగుతోంది. మరో వారం పది రోజుల్లో జగన్ పర్యటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జగన్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. ఆయన చేపట్టిన పాదయాత్ర. ఏపీ వ్యాప్తంగా చేసిన పాదయాత్ర ద్వారా, ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలు తెలుసుకున్నారు. దీంతో జగన్‌పై సానుకూలత పెరిగింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో జగన్ మమేకమైంది చాలా తక్కువ. ప్రజల మధ్యలో పర్యటించినా పరదాలు కట్టుకుని, బారికేడ్లు ఏర్పాటు చేసుకుని మాత్రమే వెళ్లేవారు.
ఏదైనా పథకం నిధుల విడుదల కోసం బటన్ నొక్కడానికి జిల్లాలకు వెళ్లినప్పుడు సభలో మాత్రమే ప్రసంగించి వెళ్లిపోయేవారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేశాయి. ఇటీవలి తుఫాను అంచనాకు కూడా టెంట్ వేసుకుని, బందోబస్తు మధ్య దూరం నుంచే చూసి వెళ్లిపోయారు. ప్రజలనే కాదు.. చివరకు సొంత పార్టీ నాయకుల్ని కూడా కలవడం లేదనే విమర్శ కూడా జగన్‌పై ఉంది. ఇలాంటి విమర్శల మధ్య జగన్ మళ్లీ జనం బాట పట్టబోతున్నారు. జనవరి 21 నుంచి నిత్యం జనాల్లో ఉండేలా టూర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించబోతున్నారు. దీనివల్ల పార్టీకి, తనకు కొత్త ఇమేజ్ వస్తుందని జగన్ అభిప్రాయం. మరి జగన్ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.