YSR 75th birth anniversary : వైఎస్ జగన్ నివాళి.. జగన్‌ను చూసి ఏడ్చిన విజయమ్మ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఈ సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో YSR ఘాట్ వద్ద నివాళి...

YS Jagan's tribute to YSR.. Vijayamma cried seeing Jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఈ సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో YSR ఘాట్ వద్ద వైఎస్ సతిమణి వైఎస్ విజయమ్మ, కుమారుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ క్రమంలో జగన్‌ను చూసి విజయమ్మ కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
ఈ కార్యక్రమంలో ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్, శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రాచమల్లు శివప్రసాధ్ రెడ్డి, రఘురామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొని నివాళి అర్పించారు.