YS SHARMILA: అన్నా.. దమ్ముంటే వీటికి ఆన్సర్‌ చెప్పు.. జగన్‌కు షర్మిల 9 ప్రశ్నలు..

6,100 టీచర్ పోస్టులతో.. ఏపీ సర్కార్‌ డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిపై షర్మిల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మహానేత వైఎస్‌ఆర్‌ నాడు 52వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే.. వారసుడిగా చెప్పుకునే జగనన్న 6వేల పోస్టులతో వేసింది దగా డీఎస్సీ అని విమర్శించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2024 | 03:35 PMLast Updated on: Feb 13, 2024 | 3:36 PM

Ys Sharmila Questions Ys Jagan Over Dsc 2024 Notification

YS SHARMILA: ఏపీ పీసీసీ పగ్గాలు అందుకున్న షర్మిల.. తగ్గేదే లే అంటోంది. జిల్లాల్లో పర్యటిస్తూ.. రచ్చబండ కార్యక్రమాలు చేపడుతున్న ఆమె.. అన్న జగన్‌ను ఓ ఆట ఆడుకుంటోంది. వైఎస్‌కు, జగన్‌కు అసలు పోలికే లేదని పదేపదే చెప్తూ.. వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది. జగన్‌ సర్కార్ అవినీతితో నిండిపోయిందని.. వైసీపీని ఓడించి తీరుతానని షర్మిల ప్రతిజ్ఞ చేస్తున్నారు. జగన్‌కు, జగన్‌ సర్కార్‌కు సంబంధించిన ప్రతీ విషయాన్ని టార్గెట్ చేస్తున్న షర్మిల.. ఇప్పుడు అన్నకు 9 ప్రశ్నలు సంధించారు.

Jaya Prada: జయప్రదను అరెస్ట్ చేయండి.. పోలీసులకు కోర్టు ఆదేశం

ఇవి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. 6,100 టీచర్ పోస్టులతో.. ఏపీ సర్కార్‌ డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిపై షర్మిల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మహానేత వైఎస్‌ఆర్‌ నాడు 52వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే.. వారసుడిగా చెప్పుకునే జగనన్న 6వేల పోస్టులతో వేసింది దగా డీఎస్సీ అని విమర్శించారు. ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ, వాళ్లను మోసే సోషల్ మీడియాకు.. ఒక సవాల్ అంటూ షర్మిల 9ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో 25వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ మెగా డీఎస్సీ ఎక్కడ..? ఐదేళ్ల పాటు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేశారు..? ఎన్నికలకు ఒకటిన్నర నెల ముందు 6 వేల పోస్టులు భర్తీ చేయడంలో ఆంతర్యం ఏంటి..? టెట్, డీఎస్సీలకు కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు వీటిలో దేనికి సన్నద్ధం కావాలి..? నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లోనే పరీక్షలు జరపడం దేశంలో ఎక్కడైనా ఉందా..? నోటిఫికేషన్ తర్వాత టెట్‌కు 20 రోజుల సమయం ఉంటే.. టెట్‌కు, డీఎస్సీకి మధ్య 6 రోజుల వ్యవధి మాత్రమేనా..?

నాడు వైఎస్‌ఆర్‌ హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్ తర్వాత.. పరీక్షకు 100 రోజులు గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్‌కు గుర్తులేదా..? ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా..? రోజుకు 5పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యమయ్యే పనేనా..? మానసిక ఒత్తిడికి గురి చేసి నిరుద్యోగులను పొట్టనబెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా..? నవరత్నాలు.. జాతి రత్నాలు అని చెప్పుకునే జగనన్న, ఆయన చుట్టూ ఉండే సకల శాఖ మంత్రులు దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అంటూ షర్మిల సవాల్ విసిరారు. మరి వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.