YS SHARMILA: కాంగ్రెస్‌లో షర్మిల చేరికకు ముహూర్తం ఫిక్స్.. అన్న వదిలిన బాణం.. అన్ననే ముంచేయబోతుందా?
తెలంగాణలో పార్టీ పెట్టి.. ఆ తర్వాత పక్కన పెట్టి.. సపోర్ట్ కాంగ్రెస్‌కే అని చేయేత్తి చూపెట్టిన షర్మిల.. హస్తం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 4న కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం అయింది.
YS SHARMILA: ఎప్పుడెప్పుడా అనే ఎదురుచూపునకు పరిష్కారం దొరికింది. తెలంగాణలో పార్టీ పెట్టి.. ఆ తర్వాత పక్కన పెట్టి.. సపోర్ట్ కాంగ్రెస్‌కే అని చేయేత్తి చూపెట్టిన షర్మిల.. హస్తం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 4న కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం అయింది. షర్మిల.. ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించబోతున్నారు. స్టార్ క్యాంపెయినర్ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అయింది. రాష్ట్రం ముక్కలు కావడం.. అదే సమయంలో తండ్రి వైఎస్ పేరుతో జగన్ పార్టీ పెట్టడంతో.. కాంగ్రెస్ లేచే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం.. వైసీపీ వైపు మళ్లింది ఒకరకంగా!
T CONGRESS: ఎప్పుడంటే.. తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారంటే..
ఐతే ఏ వైఎస్ బ్రాండ్‌తో ఏపీలో నష్టపోయిందో.. అదే వైఎస్ బ్రాండ్‌తో మళ్లీ యాక్టివేట్ కావాలని కాంగ్రెస్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే వైఎస్ తనయ.. షర్మిలను ఏపీ రాజకీయాల్లో దింపాలని ఫిక్స్ అయింది. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయ్. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా షర్మిల బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ప్రత్యేక హోదా నినాదంతో షర్మిల ప్రచారం సాగే అవకాశం ఉంది. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రచారం చేయబోతున్నారు. ప్రత్యేక హోదా అనేది ఎప్పటి నుంచి నలుగుతున్న వ్యవహారం.. విభజన జరిగి పదేళ్లు అయినా ప్రత్యేక హోదా విషయంలో క్లారిటీ రాలేదు. వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన.. నాలుగు పార్టీలు కూడా హోదా అంశాన్ని ప్రస్తావించడం కూడా మానేశాయ్ ఒకరకంగా. అలాంటిది స్పెషల్ స్టేటస్ వ్యవహారాన్ని ఎత్తుకోవడం ద్వారా.. ఒకే దెబ్బతో ఈ నాలుగు పార్టీలను ఇరుక్కుని పెట్టే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇక అటు ప్రచారంలో జగన్ పేరు ఎత్తకుండా.. వైసీపీ సర్కార్ మీద షర్మిల ప్రచారం ఆరోపణలు గుప్పించే అవకాశం ఉంది. ఇక అటు షర్మిల చేరికను ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు కన్ఫార్మ్ చేశారు. ఐతే ఏపీ పాలిటిక్స్‌లో షర్మిల ఎంట్రీతో.. లాభ నష్టాలపై నాలుగు పార్టీలు లెక్కలు వేస్తున్నాయ్. ఇదంతా ఎలా ఉన్నా.. షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టకుండా జగన్ చాలా ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ లెవల్‌లో చక్రం తిప్పారని టాక్.
ఐతే జగన్ ఏ ప్రయత్నం కూడా సక్సెస్ కాలేదు. షర్మిల ఎంట్రీ కన్ఫార్మ్ అయింది. ఐతే షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ యాక్టివ్ అయితే ఓటు బ్యాంక్ పరిస్థితి ఏంటి అనే టెన్షన్ ఇప్పుడు అన్ని పార్టీలను వెంటాడుతోంది. వైఎస్ కూతురిగా.. తెలంగాణలో షర్మిల ప్రభావం పెద్దగా లేకపోయినా.. ఏపీలో కచ్చితంగా ఉంటుంది. ఓ వర్గం ఓటర్లు, వైఎస్ కుటుంబ అభిమానుల ఓట్లు చీలే అవకాశం ఉంటుంది.. అదే జరిగితే వైసీపీకే నష్టం అనే అంచనాలు ఉన్నాయ్. అన్న వదిలిన బాణం అని అప్పట్లో షర్మిల పాదయాత్ర చేశారు. ఐతే ఆ అన్న వదిలిన బాణం.. అన్ననే ముంచేసే ప్రమాదం ఉందా అనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయ్. ఐతే వైసీపీ శ్రేణుల అంచనాలు వేరే ఉన్నాయ్. షర్మిల, కాంగ్రెస్ యాక్టివ్ అయితే… వ్యతిరేక ఓటు చీలుతుంది తప్ప.. తమ ఓటు బ్యాంక్‌కు ఎలాంటి నష్టం లేదని అంటున్నారు. ఐతే ఏపీలో రాజకీయం ఈసారి మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.