YS VIJAYAMMA: అటు జగన్.. ఇటు షర్మిల.. విజయమ్మ ఎటువైపు ?
కొడుకు వైసీపీ, కూతురు కాంగ్రెస్.. ఇద్దరూ విజయమ్మ బిడ్డలే. పైగా తన కొడుకు జగన్ మీదే.. కన్న కూతురు దండయాత్ర చేయబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మ ఎటు సపోర్ట్ చేస్తారు..? చాలా యేళ్ళుగా విజయమ్మ, జగన్ కలిసి ఏ సమావేశాల్లో కూడా కనిపించలేదు.
YS VIJAYAMMA: ఓవైపు కొడుకు జగన్మోహన్ రెడ్డి.. మరోవైపు కూతురు షర్మిల.. ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉంటారు. ఈ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఉంటారు. మరి వాళ్ళ తల్లి విజయమ్మ ఎవరి పక్షాన నిలబడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొడుకు జగన్‌తో విభేదించి.. తెలంగాణలో పార్టీ పెట్టిన కూతురు షర్మిలకు అండగా ఉంటానని చెప్పి హైదరాబాద్‌కు వచ్చారు విజయమ్మ. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా కూడా చేశారు. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పేరుతో రాజకీయం చేసిన షర్మిల వెంటే ఉన్నారు విజయమ్మ.
YS JAGAN: జగన్‌కు ఓటమి తప్పదా..! టెన్షన్ పెడుతున్న సర్వేలు !!
షర్మిల పాదయాత్రలకు, దీక్షలు చేసినప్పుడు.. అరెస్ట్ సమయాల్లోనూ అండగా నిలబడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిలను ఆశీర్వించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే షర్మిల తెలంగాణలో అస్త్ర సన్యాసం చేసి.. కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. తెలంగాణ నుంచి ఇప్పుడు ఏపీకి మారుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారా తన కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడుతోంది షర్మిల. కొడుకు వైసీపీ, కూతురు కాంగ్రెస్.. ఇద్దరూ విజయమ్మ బిడ్డలే. పైగా తన కొడుకు జగన్ మీదే.. కన్న కూతురు దండయాత్ర చేయబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మ ఎటు సపోర్ట్ చేస్తారు..? చాలా యేళ్ళుగా విజయమ్మ, జగన్ కలిసి ఏ సమావేశాల్లో కూడా కనిపించలేదు. కానీ ఈమధ్యే క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ఓ ప్రోగ్రామ్‌లో తల్లిపక్కనే నిల్చొని కేక్ కట్ చేశారు జగన్. అలాగని విజయమ్మ.. జగన్‌కు సపోర్ట్ చేస్తారని అనుకోలేం. నిజానికి అక్రమాస్తులు, క్విడ్ ప్రో కో కేసుల్లో అరెస్ట్ అయిన జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసీపీని నిలబెట్టింది విజయమ్మ, షర్మిల మాత్రమే. ఊరూ, వాడా తిరుగుతూ పార్టీకి అండగా నిలబడి.. చివరకు అధికారంలోకి తీసుకురావడంలో వీళ్ళిద్దరి పాత్ర కీలకం.
తీరా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. విజయమ్మ వైఎస్సార్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఇక ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించి వెళ్ళిపోవడం అప్పట్లో సంచలనం కలిగించింది. తెలంగాణలో షర్మిలకు మద్దతిచ్చిన విజయమ్మ.. ఏపీలోనూ అదే మద్దతు కొనసాగిస్తారా..? కొడుకు జగన్ మీదే విమర్శలు చేస్తూ ఆయన్ని ఓడించడానికి ప్రయత్నిస్తారా..? అనేది అర్థం కావట్లేదు. అయితే షర్మిల డైరెక్ట్‌గా జగన్‌ను విమర్శించకుండా.. వైసీపీ ప్రభుత్వంపై ఎటాక్ చేయవచ్చని తెలుస్తోంది. విజయమ్మ కూడా కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా ప్రచారం చేసే అవకాశాలు ఉండబోవని కొందరు అనుచరులు చెబుతున్నారు. విజయమ్మ సైలెంట్‌గా ఉంటారా.. లేదా అన్నది కొద్ది రోజుల్లో తెలుస్తుంది.