YSRCP: శ్రీకాకుళం వైసీపీ లీడర్ల కష్టాలు.. మామూలుగా లేవుగా !
ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ లీడర్స్ తమ్మినేని సీతారామ్, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ ఒక చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అందరిలాగే వీళ్లు కూడా గతంలో తమ కొడుకులకు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేశారు.
YSRCP: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు ఫాంలో ఉండగానే వారసుల పొలిటికల్ ఫ్యూచర్‌ని సెట్ చేసుకోవాలనుకుంటారు రాజకీయ నాయకులు. అందుకు తగ్గట్టే తండ్రుల అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ఎదిగే ప్రయత్నం చేస్తుంటారు పుత్రరత్నాలు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ లీడర్స్ తమ్మినేని సీతారామ్, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ ఒక చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అందరిలాగే వీళ్లు కూడా గతంలో తమ కొడుకులకు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేశారు.
MINISTER ROJA: రోజాపై తిరుగుబాటు.. నగరిలో టిక్కెట్ ఇస్తారా..?
కానీ.. అప్పట్లో వైసీపీ అధిష్టానం వారసులకు నో చెప్పడంతో సైలెంట్ అయ్యారు. కానీ.. తాజా మార్పుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పేర్ని నానికి బదులుగా వాళ్ళ కుమారులకు ఇన్ఛార్జ్ పదవులు ఇచ్చింది పార్టీ అధిష్టానం. అంటే ఇక ఎన్నికల్లో వాళ్ళే అభ్యర్థులన్నమాట. ఇది గమనించిన సిక్కోలు నేతల వారసులు.. వాళ్ళకు అవకాశం ఇచ్చిన వైసీపీ అధిష్టానం మీకెందుకు ఇవ్వదు.. మాక్కూడా టిక్కెట్స్ ఇప్పించండి అంటూ తండ్రుల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇటు వీళ్ళని కన్విన్స్ చేయలేక, అటు అధిష్టానానికి చెప్పుకోలేక సతమతమవుతున్నారు ఆ ముగ్గురు వైసీపీ నేతలు. అయినా ఓ ప్రయత్నం చేద్దామంటున్నారట. స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. గత ఎన్నికల్లో తండ్రి గెలుపునకు కృషి చేశారాయన. ఈసారి తానే బరిలో ఉండాలని ఉవ్విళ్ళూరుతున్నారు. మరోవైపు మంత్రి ధర్మాన ప్రసాదరావుకు కూడా సన్‌స్ట్రోక్ తప్పడం లేదు. చాలా సందర్భాల్లో ప్రసాదరావు పొలిటికల్ రిటైర్మెంట్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. కొన్నేళ్లుగా ధర్మాన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు తెర వెనుక సేవలందిస్తున్నారు.
ఈసారి తాను తప్పుకుంటాననీ.. తన కుమారుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరుతున్నారట ధర్మాన. మాజీ మంత్రి కృష్ణదాస్ కూడా తన వారసుడు కృష్ణ చైతన్య కోసం ట్రయల్స్‌లో ఉన్నారు. సొంత మండలం జడ్పీటీసీగా కూడా గెలిపించుకున్నారు. ఇలా జిల్లాకు చెందిన ముగ్గురు ముఖ్యనేతలు తమ వారసుల కోసం ముమ్మర ప్రయత్నాలే చేస్తున్నారు. మరి వైసీపీ అధిష్టానం వీళ్ల విన్నపాలను మన్నిస్తుందో లేదోనన్నది చూడాలి.