Home » Author » dialnews
సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి పెరిగిపోతోంది. చాలామంది రిస్కీ షాట్స్ తీస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈమధ్య వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా... మిగతా వాళ్ళు కూడా మూర్ఖంగా అలాగే చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్ ఫ్లుయెన్సర్ అన్వి కామర్ ఇలాగే చనిపోయింది. టూరిస్ట్ ప్లేసులను చుట్టేస్తూ... అక్కడ స్పెషాలిటీని చెప్పే అన్వి... కుంబే జలపాతం దగ్గర షూట్ చేస్తూ లోయలో పడి చనిపోయింది.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వస్తారా... రారా... అన్న సస్పెన్స్ వీడిపోయింది. ఈనెల 22 నుంచి మొదలయ్యే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అటెండ్ అవ్వాలని జగన్ ఫిక్సయ్యారు. వైసీపీకి బూస్టింగ్ వచ్చేలా ఓ ప్లాన్ వర్కవుట్ చేయాలని కూడా డిసైడ్ అయ్యారు.
మొన్నటిదాకా వైసీపీలో ఉండి... పదవుల కోసం వెంపర్లాడుతూ... పవన్ కల్యాణ్ ని కూడా లెక్కచేయలేదు. అధికారాంతమున అన్నట్టుగా... వైసీపీ పవర్ ఊడిపోవడంతో అలీ కూడా ఆ పార్టీ నుంచి బయటపడ్డాడు. అప్పట్లో జగన్ ఆదేశిస్తే పవన్ మీద కూడా పోటీకి సిద్ధమన్న అలీ... ఇప్పుడు పవర్ స్టార్ ముద్దు అంటున్నాడు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప-2' చేస్తున్నాడు. భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే 'పుష్ప-2' కోసం అందరూ ఎంతలా ఎదురుచూస్తున్నారో.. దాని తర్వాత అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనే ఆసక్తి కూడా అదే స్థాయిలో అందరిలో నెలకొంది.
వరల్డ్ కప్ గెలిచిన సంతోషంలో ఉన్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు వ్యక్తిగత జీవితంలో మాత్రం కష్టాలు వెంటాడుతున్నాయి. భార్య నటాషాతో విడిపోతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని మరింత బలపరిచేలా నటాషా సెర్బియాకు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హత్యకు ఎవరు కుట్ర పన్నారో ఎంక్వైరీ జరుగుతోంది. విదేశీయుల ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఆ దిశగా ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టిపెట్టాయి. ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నినట్లు ఆ దేశ భద్రతా అధికారులకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఈ సంఘటనకు కొన్ని వారాల ముందే ట్రంప్ హత్యకు ఇరాన్ ప్లాన్ చేసిందని అంటున్నారు. అందుకే సీక్రెట్ సర్వీస్ భద్రతను పెంచింది.
మొహర్రం సందర్భంగా స్టాక్ మార్కెట్ మూత పడింది. స్కూళ్ళు, ఇతర విద్యాసంస్థలు, ఆఫీసులు, బ్యాంకులు కూడా ఇవాళ మూతపడ్డాయి. BSE, NSE ల్లో ఎలాంటి ట్రేడింగ్ జరగదు. స్టాక్ మార్కెట్ మొత్తం సెలవు ఉంటుంది. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డైరివేటివ్ సెగ్మెంట్, ACLBని కూడా మూసేశారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా కూడా క్లోజో చేశారు.
జనం అన్ లిమిటెడ్ కాల్స్ కి అలవాటు పడ్డారు... మొబైల్ డేటా లేకపోతే ఒక్క నిమిషం కూడా బతకలేరు... నేను ఎంత పెంచినా కిక్కురుమనకుండా రీఛార్జ్ చేయించుకుంటారు. నాకు తిరుగులేదని విర్రవీగుతున్నారు జియో అధినేత ముకేశ్ అంబానీ. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా జియో రీఛార్జీల మోత గురించే చర్చ జరుగుతోంది. జియో రీఛార్జీలును భారీగా పెంచడం చూసి... ఎయిర్ టెల్, ఐడియా కూడా పెంచిపారేశాయి. హయ్యస్ట్ గా 25 శాతం దాకా మొబైల్ రీఛార్జీల రేట్లు పెరగడంతో కస్టమర్లు బెంబేలెత్తుతున్నారు. ఇదే టైమ్ లో అదును చూసి దెబ్బకొట్టింది టాటా. రతన్ టాటా తీసుకున్న నిర్ణయంతో జియోకి పెద్ద షాక్ తగలబోతోంది.
ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్ళుగా ఫేక్ వీడియోలు ఎంతగా హల్చల్ చేశాయో అందరికీ తెలుసు. వైసీపీ సోషల్ మీడియా నుంచి కొన్ని.... ఆ పార్టీ అభిమానులు మరికొన్ని... ఇలా ఏది రియలో... ఏది ఫేకో అర్థం కాక జనం కన్ ఫ్యూజ్ అయ్యారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినా... ఇంకా ఫేక్ వీడియోల బాధ తప్పడం లేదు. ఇప్పటికీ వైసీపీ నుంచి వస్తున్న ఇమేజెస్, వీడియోలకు కౌంటర్ ఇస్తూ... ఇంకా ఎన్నాళ్ళీ ఫేక్ బతుకులు... ఇది ఫేక్ రా సామీ అంటూ తెలుగుదేశం అధికారిక ట్విట్టర్ మీడియా పోస్టులు చేస్తూనే ఉంది.
శాంతితో ఇల్లీగల్ కనెక్షన్ ఉందో లేదో గానీ... వాళ్ళిద్దరి ఆర్థిక సంబంధాలు కూడా బయటకు వచ్చాయి. శాంతికి విజయవాడలో విల్లా కొనుక్కోడానికి తన ఇంట్లో నుంచి కోటీ 60 లక్షల రూపాయల నగదు ఇచ్చినట్టు ఆమె భర్త మదన్ మోహన్ ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి అన్ని ఎవిడెన్స్ లు ఉన్నాయన్నారు. అంత డబ్బులు విజయ్ సాయి రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చాయో లెక్క చెపాల్సి వస్తోంది. మదన్ మోహన్ పకడ్బందీగా వివరాలు చెబుతుండటంతో... ఈ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం