Space Wedding : అంతరిక్షంలో పెళ్లి.. చూద్దామా వెళ్లి..
ఇంత వరకు మనం విమానంలో , ఆకాశంలో, సముద్రంలో జరిగిన పెళ్లిళ్లు చూశాం.. చూస్తున్నాం. కానీ ఇప్పుడు మీరు చూడబోయే.. అంతరిక్షంలో పెళ్లి.

అంతరిక్షంలో పెళ్లి.. సరికొత్త ట్రెండ్ ..

భూమి నుంచి అక్షరాల లక్ష అడుగుల ఎత్తులో వెళ్లి.. అక్కడ వివాహం పూర్తయ్యాక తిరిగి కిందకు రావడానికి నెప్ట్యూన్ కు ఆరు గంటల సమయం పడుతుంది.

స్పేస్‌షిప్ నెప్ట్యూన్, ఫుట్‌బాల్ మైదానం పరిమాణం మరియు నిలబడి ఉన్నప్పుడు 700 అడుగుల పొడవు ఉంటుంది.

“స్పేస్ పర్ స్పెక్టివ్ సంస్థ” వై-ఫై సదుపాయాన్ని అందిస్తుంది. వీడియో కాల్ ద్వారా అంతరిక్షంలో జరుగుతున్న పెళ్లి వేడుకను స్మార్ట్ గా స్మార్ట్ ఫోన్ లో చూడొచ్చు.

ఇందులో అత్యాధునిక సదుపాయాలతో కూర్చుని సేద తీరడానికి కుర్చీలు, సోఫాలు, డైనింగ్ హాల్, వాష్ రూం వంటి సదుపాయాలు ఉంటాయి.

దీంతో ఇందులో పైలెట్ తో పాటు ఒకేసారి ఎనిమిది మంది ప్రయాణం చేయడానికి వీలుగా ఈ వాహనం రూపొందించారు.

భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాక పెద్ద సైజు గాజులు అద్దాల ద్వారా అక్కడి నుంచి 360 డిగ్రీల కోణంలో భూమిని వీక్షించొచ్చు.

ఒక్కో ప్రయాణీకుడి ధర $1,25,000 - ఒక్కొక్కరికి కోటి రూపాయల దాకా ఖర్చు అనగా పూర్తిగా 8 కోట్లు ఖర్చు అవుతుంది.

ఈ అంతరిక్ష బెలూన్ కు వెయ్యికి పైగా బుకింగ్స్ అయ్యాయి.

2024లో మొదటి స్పేస్ వెడ్డింగ్ లో నిర్వహించేందుకు స్పేస్ పర్ స్పెక్టివ్ సంస్థ సిద్దమైంది.