Credit Card: రికార్డ్ స్థాయిలో క్రెడిట్ కార్డ్ బకాయిలు.. దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందా..?

క్రెడిట్ కార్డు అంటేనే చేతిలో ఆస్తి ఉన్నంత ఆనందం. దీనిని సక్రమంగా వినోయోగిస్తే బంగారు గుడ్డు పెట్టే బాతులా ఉంటుంది. అదే సరైన దారిలో ఉపయోగించకుండా డ్యూ గడువులు దాటవేసే కొద్దీ దాని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి బ్యాంకు రుణాలు, ఫైనాన్స్ సంస్థల నుంచి ఆదాయానికి చెక్ పడుతుంది. తాజాగా వెల్లడైన గణాంకాల ప్రకారం క్రెడిట్ కార్డులు తీసుకొని బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 2 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు తెలిసింది. ఇది కేవలం ఏప్రిల్ మాసానికి చెందిన లెక్కలు మాత్రమే. రానున్న రోజుల్లో వీటి ప్రభావం ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. అసలు ఇంత స్థాయిలో రుణాలు చెల్లించేలా పరిస్థితి ఎందుకు మారిందో ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 26, 2023 | 08:15 PMLast Updated on: Jun 26, 2023 | 8:15 PM

2 Lakh Crores In The Month Of April Alone Due To Credit Card Rbi Said That Arrears Have Fallen To A Record Level

ఒకప్పుడు క్రెడిట్ కార్డ్ అంటే కేవలం ఆర్థికంగా పుష్టిగా ఉండే వర్గాల వారికే ఇచ్చే వారు. అది కూడా వారి బ్యాంకు లావాదేవీలు, పెట్టుబడులు అన్నింటినీ వివరంగా పరిశీలించి వేలల్లో మాత్రమే లిమిట్ జారీ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పదివేల సంపాదన ఉన్న వాడి దగ్గర నుంచి రూపాయి సంపాదన లేని వాడికి కూడా క్రెడిట్ కార్డు మంజూరు చేస్తున్నారు. అలా వీటి వినియోగం పెరిగింది. అందులోనూ అప్పు తిరిగి చెల్లించే కాలపరిమితి దాదాపు నెలకు పైనే ఉంటుంది. ఈ ధైర్యంతో అవసరం ఉన్నవి లేనివి అన్నింటినీ కొనుగోలు చేస్తున్నారు కొందరు. దీంతో వీటి వాడకం విలువ పెరిగిపోయింది. వాడకం విలువతో పాటూ అందరూ సక్రమంగా సమయానికి చెల్లిస్తారని చెప్పలేము. అలా ఎవరైతే గడువు లోపు చెల్లించరో బ్యాంకుల్లో బకాయిల శాతం కూడా పెరిగిపోతుంది. అందుకే తాజాగా రికార్డ్ స్థాయిలో చెల్లింపుల మొత్తం పెరిగిపోయింది. గత ఏడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపు 30 శాతం వృద్ది సాధించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఆర్బీఐ మాత్రం తీవ్ర అభ్యంతరంతో పాటూ ఆందోళనను వ్యక్తం చేస్తుంది. సెక్యూరిటీ లేని లోన్లు ఇవ్వడం, ఇలా క్రెడిట్ కార్డుల లిమిట్ పెంచడం రానున్న కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. దీనిని కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ సంస్థలు తోసిపుచ్చాయి. కేవలం క్రెడిట్ కార్డ్ వల్ల ఇలా జరగడం లేదని వివరించాయి. తమ బ్యాంకులు క్రెడిట్ కార్డులు, లోన్లు ఇచ్చేటప్పుడు వారి వ్యక్తిగత ఆదాయ వనరులతోపాటూ, బ్యాంకు అకౌంట్ లోని లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించి జారీచేస్తామని తెలిపాయి. తాజాగా క్రెడిట్ కార్డ్ బకాయిలు పెరగడానికి ప్రదాన కారణం ద్రవ్యోల్బణం పెరడమే అని తేల్చింది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో క్రెడిట్ కార్డులు ఉపయోగించి రూ. 2 లక్షల కోట్ల మేరా ట్రాన్సాక్షన్స్ జరిపినప్పటికీ వాటిలో రూ. 1.3 లక్షల కోట్లు తిరిగి బ్యాంకులకు చెల్లింపులు జరిగినట్లు ఆర్బీఐ గతంలో వెల్లడించిందని క్రెడిట్ కార్డ్ సంస్ధలు వెల్లడించాయి.

ప్రపంచంలోని అన్ని దేశాలతో ఒక్కసారి పోల్చి చూస్తే మన దేశంలో క్రెడిట్ కార్డు వినియోగదారుల సంఖ్య చాలా తక్కువ అని తెలిపింది. భారత్ లో కేవలం 5 శాతం మంది దగ్గర మాత్రమే క్రెడిట్ కార్డులు ఉన్నాయని చెప్పుకొచ్చాయి. బ్యాంకులు ఇచ్చిన రుణాలు కేవలం ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే ఇవ్వలేదని.. ఇందులో గృహ, వాహన, వ్యక్తిగత లోన్లు ఉన్నాయని పేర్కొంది. క్రెడిట్ కార్డుల ద్వారా 1.4 శాతం, హౌసింగ్ లోన్లు 14.1 శాతం, వాహన రుణాలు 3.7 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాట్లు గుర్తుచేశాయి. అంటే ఇప్పటి వరకూ క్రెడిట్ కార్డులు ఉపయోగించినప్పటికీ బ్యాంకులకు పెద్దగా వచ్చిన నష్టం ఏమీ లేదని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

T.V.SRIKAR