Atthamma’s Kitchensa Megastar’ : ‘అత్తమ్మాస్‌ కిచెన్స ఫుడ్ బిజినెస్‌లోకి మెగాస్టార్ భార్య‌

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ వేరే లెవ‌ల్‌లో ఉంటుంది.. అనుబంధం, ఆప్యాయ‌త‌లు, ప్రేమాభిమానాల‌తో మెగా కుటుంబం న‌లుగురికీ ఎంతో ఆద‌ర్శ‌వంతంగా ఉంటుంది అన‌డంలో సందేహం లేదు.. ఇక‌.. మెగా కోడ‌లు ఉపాస‌న సైతం ఆ ఫ్యామిలీకి త‌గిన‌ట్లుగానే ఎంతో ప్రేమానురాగాల‌తో ఉంటుంది..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 19, 2024 | 12:09 PMLast Updated on: Feb 19, 2024 | 12:09 PM

Atthammas Kitchensa Megastars Wife Enters Food Business

టాలీవుడ్‌లో (Tollywood) మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ వేరే లెవ‌ల్‌లో ఉంటుంది. అనుబంధం, ఆప్యాయ‌త‌లు, ప్రేమాభిమానాల‌తో మెగా కుటుంబం న‌లుగురికీ ఎంతో ఆద‌ర్శ‌వంతంగా ఉంటుంది అన‌డంలో సందేహం లేదు.. ఇక‌.. మెగా కోడ‌లు ఉపాస‌న సైతం ఆ ఫ్యామిలీకి త‌గిన‌ట్లుగానే ఎంతో ప్రేమానురాగాల‌తో ఉంటుంది. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా త‌న అత్త‌మామ‌లు, భ‌ర్త త‌ర‌పు కుటుంబీకుల‌పై త‌నకున్న ప్రేమాభిమానాలు, గౌర‌వాన్ని బ‌య‌ట‌పెడుతూ ఉంటుంది.. ఈ క్ర‌మంలోనే ఇవాళ త‌న అత్త‌గారైన సురేఖ (Surekha) పుట్టిన‌రోజు సంద‌ర్భంగా.. త‌న అత్త‌మ్మ‌పై ఉన్న ప్రేమ‌ను మ‌రోసారి ఎక్స్‌ప్రెస్ చేసింది. అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా ఉపాస‌న చెప్పిన ఓ స‌ర్‌ప్రైజ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్‌గా మారి.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

కోడలు ఉపాసన కూడా సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతూ.. ‘అత్తమ్మాస్‌ కిచెన్‌’ పేరుతో ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్‌ (Mega Food Business) లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్ర‌క‌టించింది.. కోడ‌లు ఉపాసన నేతృత్వంలో.. అత్త‌మ్మ‌ సురేఖ స్థాపించిన ఈ కొత్త వెంచర్, భోజనప్రియులకు ట్రెడిషనల్ రుచుల్ని అందించ‌నుంది. ఇందులో ఉండే ఫుడ్ ప్రొడక్ట్స్‌ రెసిపీల‌న్ని మెగాస్టార్‌ సతీమణి సురేఖ చేసిన‌వి కావ‌డం విశేషం.. ప్రారంభంలో ఉప్మా, పొంగల్, పులిహోర, రసం ఇనిస్టెంట్ మిక్స్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు.. కాగా.. సురేఖ చేసే రసం అంటే తనకు చాలా ఇష్టమని చిరంజీవి గతంలో పలు సందర్భాల్లో చెప్పారు.. ఇప్పుడు ఈ వెంచ‌ర్ ద్వారా ఆ రెసిపీ కూడా అందరికీ అందుబాటులోకి వచ్చినట్టయింది.. అంతేకాదు. మ‌న సంప్రదాయానికి అనుగుణంగా రుచి ఉన్న ఈ వంటశాలలో బంధాలు త‌ర‌త‌రాలుగా నిర్మించ‌బ‌డ‌తాయ‌ని ఉపాస‌న చేసిన పోస్ట్ ఇప్పుడు నెటిజ‌న్ల మ‌న‌స్సుల‌ను దోచుకుంటోంది..

కాగా.. ఈ ఫుడ్ ప్రొడక్ట్స్‌ అన్నీ athammaskitchen.com వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు ఉపాస‌న ప్ర‌క‌టించింది.. ఈ వెంచర్ కోసం ఉపాసన తన బిజినెస్ టాలెంట్‌ను అంతా ఉప‌యోగించిన‌ట్లు తెలుస్తోంది.. వెబ్ సైట్ డిజైన్ నుంచి ప్రతి విషయాన్ని దగ్గరుండి తన టీమ్ తో చేయించుకుంద‌ని టాక్ వినిప్తోంది.. తెలుగు సంప్రదాయాల్లో భాగంగా ఉన్న అన్ని వంటకాల రెసిపీల్ని ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాల‌న్న ల‌క్ష్యంతోనే.. తన అత్త‌మ్మ ద్వారా ఈ వెంచ‌ర్‌ను ప్రారంభించిందట సురేఖ‌.. మొత్తానికి అత్త సురేఖతో ఉపాసనకు ఉన్న బంధాన్ని ఈ వెంచర్ ఆవిష్కరిస్తుందని మెగా ఫ్యాన్స్ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.. త‌న అత్త‌మ్మ‌కు ఉపాస‌న మెమ‌ర‌బుల్ గిఫ్ట్ ఇచ్చింద‌నీ.. ఇప్ప‌టికే అత్తమ్మ సురేఖ‌తో ఉన్న అనుబంధాన్ని అనేక సార్లు బ‌య‌ట‌పెట్టిన మెగా కోడ‌లు.. ‘అత్తమ్మ కిచెన్’ అనే వెంచర్‌ను లాంచ్ చేసి మరోసారి అత్తపై ప్రేమను చాటుకుంద‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.