మామను మించిన బిజినెస్‌ మైండ్‌ అదానీకి కాబోయే కోడలి బ్యాగ్రౌండ్‌

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన కుటుంబాల్లో ఒకటి అదానీ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీకి కోడలిగా వెళ్లాలి అంటే పెట్టి పుట్టాలి. అందుకే ఇప్పుడు అందరి ఇంట్రెస్ట్‌ గౌతమ్‌ అదానీ కొడుకు జీత్‌ అదానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీదే ఉంది. గౌతమ అదానీ కొడుకు జీత్ అదానీ దివా జైమిన్‌ షా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 3, 2025 | 07:55 PMLast Updated on: Feb 03, 2025 | 7:55 PM

Background Of Adanis Future Daughter In Law

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన కుటుంబాల్లో ఒకటి అదానీ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీకి కోడలిగా వెళ్లాలి అంటే పెట్టి పుట్టాలి. అందుకే ఇప్పుడు అందరి ఇంట్రెస్ట్‌ గౌతమ్‌ అదానీ కొడుకు జీత్‌ అదానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీదే ఉంది. గౌతమ అదానీ కొడుకు జీత్ అదానీ దివా జైమిన్‌ షా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. రీసెంట్‌గానే వీళ్ల ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. అదానీకి కాబోయే కోడలు కావడంతో అంతా ఇప్పుడు దివా గురించి సర్చ్‌ చేస్తున్నారు. గౌతమ్‌ అదానీకి కాబోయే కోడలు నార్మల్‌ అమ్మాయేం కాదు. వాళ్లు కూడా చాలా రిచ్‌. అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైనిమ్‌ షా కూతురే ఈ దివా షా. సీ దినేష్‌ అండ్ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత జైమిన్‌ షా. 2023లోనే జీత్‌, దివాల ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

దాదాపు రెండేళ్ల తరువాత వీళ్లిద్దరు ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. జైమిన్‌ షా తన కూతుర్ని చాలా సింపుల్‌గా పెంచాడు. పుట్టి పెరిగింది ఐశ్వర్యంలోనే అయినా ఎక్కడా తనకు ఆ డబ్బు అంటుకోలేదు. దీనికి తోడు వ్యాపారంలో తండ్రిని మించిన కూతురు దివా. ‘సి. దినేష్‌ అండ్‌ కో ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో సూరత్‌, ముంబైలలో పలు కేంద్రాలను నెలకొల్పి వజ్రాల వ్యాపారంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు జైమిన్‌ షా. తండ్రి మార్గనిర్దేశకత్వంతో దివా కూడా అదే వ్యాపార రంగంలో దిగింది. జిగర్‌ దోషి, అమిత్‌ దోషి, యోమేష్‌ షా వంటి బృంద సభ్యుల సహకారంతో తండ్రి నేషనల్‌ లెవెల్‌కు తీసుకెళ్లిన వ్యాపారాన్ని ఆమె ఇంటర్నేషనల్‌ లెవెల్‌కు తీసుకువెళ్లింది. నెదర్లాండ్స్‌, హాంకాంగ్‌లలోనూ కార్యాలయాలు స్థాపించింది.

బిజినెస్‌తో పాటు ఫైనాన్స్‌కు సంబంధించిన విషయాల్లో దివాకు మంచి గ్రిప్‌ ఉంది. అందుకే తన బిజినెసకు సంబంధించిన వ్యవహారాలన్నీ తానే చూసుకుంటుంది. కొంచెం డబ్బు ఉంటే చాలు తమను మించినవాళ్లు లేరని విర్రవీగే ఈ రోజుల్లో దివా చాలా లో ప్రొఫైల్‌ మెయిన్‌టేన్‌ చేస్తోంది. ఈ కాలంలో కూడా తాను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటూ ఫుల్‌గా బిజినెస్‌ మీదే ఫోకస్‌ చేస్తోంది. దివా ఫేస్‌ ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఆమె పేరు మాత్రం వ్యాపారంలో ఉన్న చాలా మందికి తెలుసు. ఇదే తన సక్సెస్‌ ఫార్ములా. దివాలో ఉన్న ఈ క్వాలిటీనే అదానీ ఫ్యామిలీని ఆకట్టుకుంది.

అందుకే ఏరికోరి మరీ గౌతమ్‌ అదానీ దివాను తన కోడలిగా చేసుకుంటున్నాడు. ఇద్దరి కుటుంబా బాగా రిచ్‌ కావడంతో పెళ్లి దేశం మొత్తం మాట్లాడుకునేలా జరుగుతుందని.. దేశవిదేశాల నుంచి బంధుమిత్రులు వస్తారని టాక్‌ నడిచింది. కానీ వీళ్లిద్దరి పెళ్లి చాలా సింపుల్‌గా జరగబోతోంది. సాదాసీదాగా సంప్రదాయ పద్ధతిలో తన కొడుకు పెళ్లి చేయబోతున్నానని గౌతమ్‌ అదానీ చెప్పారు. 2023 మార్చి 14న జీత్‌, దివాల నిశ్చితార్థం జరిగింది. గత డిసెంబరులో ఉదయ్‌పూర్‌లో ప్రీ వెడ్డింగ్‌ ఫంక్షన్‌ జరిగింది. త్వరలోనే ఈ కపుల్‌ పెళ్లిపీఠలెక్కబోతున్నారు. ఇదీ అదానీ ఇంటికి కాబోయే కోడలు దివా బ్యాగ్రౌండ్‌.