Chandrayaan-3: చంద్రుడికి వంద కి.మీల దూరంలో చంద్రయాన్.. అసలు సవాల్ ఇప్పుడే ఎదురుకాబోతుందా..?
ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత నుంచి ఇప్పటి వరకూ నాలుగు దశల్లో దీని విన్యాసాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం చంద్రుడికి కేవలం వంద కిలోమీటర్ల దూరంలోనే ఉంది చంద్రయాన్ 3 స్పేస్‌క్రాఫ్ట్. ఇస్రో వ్యోమనౌక చివరి కక్ష్య తగ్గింపును విజయవంతంగా పూర్తి చేశారు.
Chandrayaan-3: ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3.. చంద్రుని ఉపరితలానికి మరింత చేరువైంది. ఈ వ్యోమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఇస్రో సైంటిస్టులు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ నుంచి ఆదేశాలు పంపి వ్యోమనౌక ఎత్తును క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత నుంచి ఇప్పటి వరకూ నాలుగు దశల్లో దీని విన్యాసాలు పూర్తయ్యాయి.
ప్రస్తుతం చంద్రుడికి కేవలం వంద కిలోమీటర్ల దూరంలోనే ఉంది చంద్రయాన్ 3 స్పేస్‌క్రాఫ్ట్. ఇస్రో వ్యోమనౌక చివరి కక్ష్య తగ్గింపును విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం భారత వ్యోమనౌక చంద్రుడి చుట్టూ 153 కిలోమీటర్లు, 163 కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతోంది. ఆగస్ట్ 23 సాయంత్రం ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ కానుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్‌ను వేరు చేయడానికి ఆగస్టు 17న ప్లాన్ చేసింది. 18 నుంచి నుంచి ల్యాండర్ వేగం నెమ్మదిస్తుందని ఇస్రో తెలిపింది. ఆగష్టు 18న చివరిగా కక్ష్యను తగ్గించినప్పుడు చంద్రుడి ఉపరితలం, చంద్రయాన్-3 మధ్య దూరం కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. తర్వాత ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్‌ను దింపాలని ఇస్రో భావిస్తోంది.
అయితే, ఈ విషయంలో అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటుంది. లేకుంటే మళ్లీ వచ్చే నెలలోనే ల్యాండింగ్ జరగనుంది. ల్యాండింగ్‌లో కీలకమైన భాగం.. ల్యాండర్ వేగాన్ని 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి తుది ల్యాండింగ్‌కు తీసుకురావడం. అంతరిక్ష నౌకను అడ్డం నుంచి నిలువు దిశకు బదిలీ చేయడమనే కీలక ప్రక్రియ ముందుందని ఇస్రో తెలిపింది.