ChatGPT: దివాళా దిశగా చాట్‌జీపీటీ.. భారీ ఖర్చు.. పడిపోయిన ఆదాయం..!
ఆన్‌లైన్‌లో ఇటీవలి కాలంలో చాట్ జీపీటీ ప్రస్తుతం ఒక సంచలనం సృష్టిస్తోంది. కంటెంట్ రాయడం, కావాల్సిన వివరాలు వెతికి తేవడం వంటి పనుల చేస్తుంది చాట్ జీపీటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఇది పని చేస్తుంది.
ChatGPT: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చాట్ జీపీటీ దివాళా దిశగా సాగుతోందా..? శామ్ అల్ట్‌మన్ ఆధ్వర్యంలోని, ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీ నష్టాల దిశగా సాగుతున్నట్లు అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ అనే సంస్థ పేర్కొంది. ఈ సంస్థ అంచనా ప్రకారం.. 2024 నాటికి దివాళా తీస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థను నడిపించేందుకు రోజుకు రూ.5.87 కోట్లు ఖర్చవుతోంది. అయితే, డబ్బులు ఇంతగా ఖర్చవుతున్నప్పటికీ.. ఆదాయం మాత్రం తక్కువగా ఉంది.
ఆన్‌లైన్‌లో ఇటీవలి కాలంలో చాట్ జీపీటీ ప్రస్తుతం ఒక సంచలనం సృష్టిస్తోంది. కంటెంట్ రాయడం, కావాల్సిన వివరాలు వెతికి తేవడం వంటి పనుల చేస్తుంది చాట్ జీపీటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఇది పని చేస్తుంది. దీనివల్ల ఇప్పటికే చాలా మందికి ఉపాధి కోల్పోయారు. దీనిపై చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ వల్ల లక్షలాది ఉద్యోగాలు పోతాయని అంటున్నారు. ప్రస్తుతం చాట్ జీపీటీని వాడుతున్న వారి సంఖ్య కోట్లలోనే ఉంది. అయితే, క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత జూన్‌లో 170 కోట్ల మంది యూజర్లు ఉండగా, ఇప్పుడు ఈ సంఖ్య 150 కోట్లకు చేరింది. కొద్ది రోజుల్లోనే 12 శాతం పడిపోయింది. మరోవైపు చాట్ జీపీటీ-3.5, చాట్ జీపీటీ-4 వాడుకొనేందుకు యూజర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ కంపెనీకి సరిపడినంత ఆదాయం రావడం లేదు.
ఇప్పట్లో బ్రేక్ ఈవెన్ రావడం కష్టమేనని కూడా నిపుణులు అంటున్నారు. చాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చి ఏడాది కూడా కాకముందే సంచలనం సృష్టించింది. మొదట్లో దీన్ని వాడేవారి సంఖ్య పెరిగినప్పటికీ, ఇప్పుడు తగ్గుతోంది. దీని నిర్వహణకు ఖర్చు ఎక్కువ అవుతోంది. కానీ, ఆదాయం తక్కువగా వస్తోంది. దీనికి కారణం.. ఇతర కంపెనీలు ఉచితంగా సేవలందిస్తున్నాయి. దీంతో యూజర్లు ఇతర ప్లాట్‌ఫామ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా కంపెనీ ఆదాయం తగ్గడంతో 2024 చివరికల్లా దివాళా తీసే పరిస్థితులున్నాయని తాజా నివేదిక చెబుతోంది.