GST On Popcorn: థియేటర్స్‌లో పాప్‌కార్న్‌పై జీఎస్టీ.. ఇక వాయింపుడే..
థియేటర్స్‌లో అమ్మే ఫుడ్ మీద జీఎస్టీ పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లో ఆమ్మే ఫుడ్ మీద 5 శాతం జీఎస్టీ విధించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ రేట్లు మరింత పెరిగిపోతాయి. ఈ నెల 11న జీఎస్టీ కమిటీ మీటింగ్ జరగబోతోంది.
GST On Popcorn: సినిమాకు వెళ్లామంటే చాలు.. ఇంటర్వెల్‌లో పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ పడాల్సిందే. లేదంటే సినిమా చూసిన ఫీల్ కూడా ఉండదు చాలా మందికి. కొందరైతే సినిమా కంటే పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి వీటి రేట్లు తక్కువగా ఉంటాయా అంటే అదీలేదు.
ముఖ్యంగా ఫ్యామిలీతో సినిమాలకు వెళ్లేవాళ్లకు సినిమా టికెట్ల కంటే అక్కడ దొరికే పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ దడ పుట్టిస్తాయి. సింపుల్‌గా నాలుగు పాప్‌కార్న్ కొనాలంటే ఆస్తులు అడిగేస్తారు. ధరలు ఆ రేంజ్‌లో ఉంటాయి మరి. ఇక ఫ్రెండ్స్‌తో వెళ్లే వాళ్లు దాదాపుగా వాటి జోలికి వెళ్లరు. సైలెంట్‌గా సినిమా చూసి వచ్చేస్తారు. కానీ భార్యా పిల్లలతో సినిమాలకు వచ్చేవాళ్ల జేబుకు మాత్రం చిల్లు పడ్డట్టే. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఈ పరిస్థితి మరీ అధ్వానంగా తయారయ్యే చాన్స్ ఉంది. ఎందుకంటే థియేటర్స్‌లో అమ్మే ఫుడ్ మీద జీఎస్టీ పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లో ఆమ్మే ఫుడ్ మీద 5 శాతం జీఎస్టీ విధించబోతున్నట్టు తెలుస్తోంది.
ఇదే జరిగితే పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ రేట్లు మరింత పెరిగిపోతాయి. ఈ నెల 11న జీఎస్టీ కమిటీ మీటింగ్ జరగబోతోంది. ఈ మీటింగ్‌లో దేనిపై జీఎస్టీ విధించాలి, దేనిపై జీఎస్టీ తొలగించాలి అనే నిర్ణయం తీసుకుంటారు. ఈ మీటింగ్‌లోనే ఫుడ్ మీద జీఎస్టీ విధించే నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఈ విషయంలో మూవీ లవర్స్ చాలా డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు.